Chinturu: మోతుగూడెంలో రూ.12.50 లక్షల విలువైన లిక్విడ్ గంజాయి స్వాధీనం

Chinturu: మోతుగూడెంలో రూ.12.50 లక్షల విలువైన 1 కేజీ లిక్విడ్ గంజాయి స్వాధీనం. ముగ్గురు నిందితుల అరెస్ట్, ఎస్ఐ అబ్దుల్ నాసిర్ దాడులు.

RAJESH REDDY, CHINTOOR
Published on: 9 Nov 2026 8:48 PM IST
Chinturu
X

Chinturu: మోతుగూడెంలో రూ.12.50 లక్షల విలువైన లిక్విడ్ గంజాయి స్వాధీనం

చింతూరు: ఒడిశా నుంచి ఉత్తరప్రదేశ్‌కు అక్రమంగా తరలిస్తున్న రూ.12.50 లక్షల విలువైన 1 కేజీ లిక్విడ్ గంజాయిని మోతుగూడెం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లా టెలరాయ్ గ్రామం నుంచి ఉత్తరప్రదేశ్‌కు లిక్విడ్ గంజాయిని తరలిస్తున్నట్లు పక్కా సమాచారం అందడంతో మోతుగూడెం ఎస్‌ఐ అబ్దుల్ నాసిర్ హుస్సేన్ తన సిబ్బందితో కలిసి దాడి నిర్వహించి పట్టుకున్నారు.

అరెస్ట్ అయిన నిందితులు:

1. ఆశు జాఫ్రీ - ఉత్తరప్రదేశ్

2. ముకుంద హంతల్ - ఒడిశా

3. మాల మడకామి - ఒడిశా

వారి వద్ద నుంచి 1 కేజీ లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకుని, వారిపై చట్టప్రకారం కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టారు.ఈ దాడి లో ఏఎస్‌ఐ టీ. రాజేశ్వరరావు, ఎం. గంగరాజు, హెడ్ కానిస్టేబుల్ మురళి పాల్గొన్నారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR