Chinturu: జనసేన సైనికుడు నాగరాజు.. ముకునూరును మార్చే యువశక్తి!
Chinturu: చింతూరు మండలం ముకునూరు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జనసేన మద్దతుతో బరిలో దిగిన పాయం నాగరాజు ప్రతి గడపకూ వెళ్లి ఆప్యాయంగా పలకరిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు.
Chinturu: జనసేన సైనికుడు నాగరాజు.. ముకునూరును మార్చే యువశక్తి!
చింతూరు: పంచాయతీ ఎన్నికల వేడి ముకునూరులో పీక్స్‌కు చేరింది. జనసేన మద్దతుతో బరిలో దిగిన పాయం నాగరాజు ప్రచారాన్ని ఓరెత్తిస్తున్నారు.పంచాయతీ పరిధిలోని ప్రతి గడపకు వెళ్లి, చిన్నా పెద్దా తేడా లేకుండా అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, పేరు పెట్టి మరీ కుశల ప్రశ్నలు వేస్తూ నాగరాజు ఓటర్లను ఆకర్షిస్తున్నారు.
ఆయన నవ్వు, ఆప్యాయత చూసి ఓటర్లే స్వయంగా ముందుకు వచ్చి "నీకే మా ఓటు" అంటున్నారు.నాగరాజు వెంట జనసైనికులు ప్రవీణ్ కుమార్ (కప్పు), సతీష్, రమణమ్మలు అడుగడుగునా అండగా నిలుస్తున్నారు. వీధి వీధినా వీరి ప్రచార హోరుతో ముకునూరు మారుమోగిపోతోంది. జనసైనికుల జోష్ చూసి ప్రత్యర్థి శిబిరంలో గుబులు మొదలైందనే చర్చ గ్రామంలో జోరుగా సాగుతోంది.
"యువకుడైన నాగరాజు గెలిస్తేనే పంచాయతీ అభివృద్ధి బాటలో పయనిస్తుంది" అంటూ జనసైనికులు గ్రామస్తులకు వివరిస్తున్నారు. ఎవరి సమస్య చెప్పినా వెంటనే స్పందించే గుణం నాగరాజు సొంతమని, అలాంటి నాయకుడిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నారు.




