Chinturu: ప్రజా సమస్యలను బుట్టదాఖలు కానివ్వను సబ్ కలెక్టర్ నరేంద్ర పడాల్

Chinturu: చింతూరు సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర పడాల్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి, పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయడానికి కృషి చేస్తానన్నారు.

RAJESH REDDY, CHINTOOR
Published on: 1 Oct 2026 11:11 PM IST
Chinturu
X

Chinturu: ప్రజా సమస్యలను బుట్టదాఖలు కానివ్వను సబ్ కలెక్టర్ నరేంద్ర పడాల్

చింతూరు: ప్రజలు ఇచ్చిన సమస్యల వినతి పత్రాలను బుట్ట దాఖలు కానివ్వనని చింతూరు సబ్ కలెక్టర్ నరేంద్ర పడాల్ అన్నారు.

గురువారం చింతూరు సబ్ కలెక్టర్ గా నరేంద్ర పడాల్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియాతో నరేంద్ర పడాల్ మాట్లాడారు.

చింతూరు డివిజన్ పరిధిలో నెలకొన్న సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని నరేంద్ర పడాల్ అన్నారు.

ప్రజా సమస్యలను పరిష్కరిస్తానని వాటిని బుట్ట దాఖలు కానివ్వనని తెలిపారు. ప్రధానంగా పోలవరం నిర్వాసితుల పరిహారం,పునరావాసం కల్పనలో ప్రత్యేక శ్రద్ధ చూపి ప్రతి ఒక్క నిర్వాసితునికి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.

ఏజెన్సీలో ఎటువంటి సమస్యలు ఉంటాయో తనకు తెలుసని వాటిని అధికమించడానికి తనవంతు ప్రయత్నం చేస్తానని అన్నారు.సబ్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర పడాల్ ను అధికారులు సిబ్బంది అభినందించారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR