Sakhinetipalli: ఘనంగా చిరంజీవి జన్మదిన వేడుకలు రక్తదానం చేసిన ఫ్యాన్స్!
Sakhinetipalli: అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లిలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి రక్తదానం చేసిన అభిమానులు, సేవా సమితి ప్రతినిధులు.
Sakhinetipalli: ఘనంగా చిరంజీవి జన్మదిన వేడుకలు రక్తదానం చేసిన ఫ్యాన్స్!
Sakhinetipalli: అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి గ్రామ పంచాయతీ ప్రాంగణంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. అఖిల భారత చిరంజీవి యువత పర్యవేక్షణలో సఖినేటిపల్లి, మలికిపురం మండలాల చిరు, పవన్, చరణ్ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. చిరంజీవి చిత్రపటానికి పూలమాలలు వేసి, కేక్ కట్ చేసి అభిమానులకు పంపిణీ చేశారు. అనంతరం అభిమానులు పెద్ద సంఖ్యలో రక్తదానం చేశారు.
ఈ సందర్భంగా జనసేన నాయకుడు గుండుబోగుల పెదకాపు మాట్లాడుతూ.. చిరంజీవి స్ఫూర్తితోనే తాము రాజకీయాల్లోకి వచ్చామని తెలిపారు. సినీ రంగంలోనే కాకుండా సేవా కార్యక్రమాల్లోనూ చిరంజీవి ఎందరికో ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. రక్తదానం, నేత్రదానం వంటి కార్యక్రమాల ద్వారా ఎంతోమందికి అండగా నిలిచారని కొనియాడారు. 71 ఏళ్ల వయసులోనూ ఆయన ఉత్సాహం, స్టామినా ఏమాత్రం తగ్గలేదన్నారు.
కార్యక్రమంలో మెగా యూత్ ఫోర్స్ సఖినేటిపల్లి మండల అధ్యక్షుడు బల్ల చరణ్, సఖినేటిపల్లి నీటి సంఘం అధ్యక్షుడు నామన నాగభూషణం, రావి మురళి, గుండుబోగుల నాగు, ముదిగొండ బుజ్జి తదితరులు పాల్గొన్నారు.




