P Gannavaram: పి.గన్నవరంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం!
P Gannavaram: పి.గన్నవరంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం.. ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, 'వెన్నుపోటు పాలన' పాంప్లెట్ ఆవిష్కరణ.
P Gannavaram: పి.గన్నవరంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం!
P Gannavaram: పి.గన్నవరం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం పి గన్నవరం నియోజకవర్గ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడింది.
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి పాల్గొని పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు గ్రామస్థాయి నుంచి పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పిఎసి సభ్యులు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, జడ్పీ చైర్మన్ విపత్తి వేణుగోపాలరావు పాల్గొన్నారు.
అనంతరం జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి గారి చేతుల మీదుగా పి.గన్నవరం నియోజకవర్గంలో రాష్ట్ర, జిల్లా, అసెంబ్లీ స్థాయిల్లో వివిధ పదవుల్లో ఉన్న నాయకులు, పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్న నాయకులు, కార్యకర్తలకు ఐడెంటిటీ కార్డులను అందజేశారు.
పార్టీకి కష్టకాలంలో అండగా నిలిచిన ప్రతి నాయకుడు, కార్యకర్తను గుర్తిస్తూ వారికి బాధ్యతలు అప్పగించి పార్టీని క్షేత్రస్థాయిలో మరింత పటిష్టం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా సూచించారు.
అనంతరం “వెన్నుపోటు పార్టీ – వెన్నుపోటు పాలన” పోస్టర్‌ను చిర్ల జగ్గిరెడ్డి ఆవిష్కరించారు. ఈ నెల 23వ తేదీ నుంచి నిర్వహించనున్న “వెన్నుపోటు పార్టీ – వెన్నుపోటు పాలన” పై ప్రజలకు అవగాహన కల్పించే “గడపగడపకు మీ గన్నవరపు” కార్యక్రమానికి సంబంధించిన పాంప్లెట్‌ను కూడా ఆవిష్కరించారు.
ప్రజలకు వాస్తవ పరిస్థితులను వివరించి, వెన్నుపోటు రాజకీయాలు మరియు పాలనలో చోటుచేసుకుంటున్న పరిణామాలను ప్రతి గడపకు తీసుకెళ్లేలా పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
రానున్న రోజుల్లో పి.గన్నవరం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను మరింత ఉధృతం చేసి ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు.




