Kadiyam: డి తోకల చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయం.. చోటా కె. నాయుడు
Kadiyam: దుళ్లలో డి తోకల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వికలాంగులకు నగదు, రోగులకు పండ్ల పంపిణీ. కార్యక్రమానికి హాజరైన ప్రముఖ సినీ కెమెరామెన్ చోటా కె. నాయుడు.
Kadiyam: డి తోకల చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయం.. చోటా కె. నాయుడు
కడియం: డి తోకల చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని ప్రముఖ సినీ కెమెరా మెన్ చోటా కె నాయుడు అన్నారు. గురువారం ఆయన సతీమణి సీతాదేవి తో కలసి కడియం మండలం దుళ్ల లో సోదరుడు కామిరెడ్డి గాంధీ నివాసానికి వచ్చారు.
ఈసందర్భంగా తన మేనల్లుడు తోకల దుర్గారావు నెలకొల్పిన డి తోకల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గ్రామంలోని వికలాంగులు గంటి బ్రహ్మాజీ , గంపల మల్లేశ్వరరావు లకు పదివేల రూపాయలు నగదు సహాయం అందజేశారు.
కడియం ప్రభుత్వ ఆసుపత్రి లోని రోగులకు పండ్లు, రొట్టెలు ట్రస్ట్ చైర్మన్ తోకల మాధురి, ట్రస్టీలు తోకల వీర రాంబాబు, కామిరెడ్డి అమ్మిరాజు ల చేతులు మీదుగా అందజేశారు. ఈసందర్భంగా చోటా కె నాయుడు మాట్లాడుతూ బెంగుళూరులో దుర్గారావు ఉద్యోగం చేసుకుంటున్నప్పటికి పుట్టి పెరిగిన గ్రామాన్ని మరచి పోకుండా, గ్రామంలో ప్రతి ఏటా నిరుపేదలకు దుస్తుల పంపిణి చేయడం, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నోటు పుస్తకాలు అందించడం, ర్యాంకులు సాధించిన వారికి ఆర్ధిక బహుమతులు అందించడం వంటి సేవలు స్ఫూర్తి దాయకమన్నారు.
మంచి కార్యక్రమాలు చేపడుతున్న ఇలాంటి ట్రస్ట్ లకు తన వంతు సహకారం అందిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కామిరెడ్డి మంగతాయారు, సౌజన్య, కురసా కుమారి, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.




