Rajahmundry: మట్టి వినాయకులతో పర్యావరణానికి మేలు: కమిషనర్ రాహుల్ మీనా

Rajahmundry: పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకులను పూజించాలని రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా పిలుపునిస్తూ ప్రతిమలను పంపిణీ చేశారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY
Published on: 11 Sept 2026 8:01 PM IST
Rajahmundry
X

Rajahmundry: మట్టి వినాయకులతో పర్యావరణానికి మేలు: కమిషనర్ రాహుల్ మీనా

రాజమండ్రి: పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టితో తయారుచేసిన వినాయక విగ్రహాలను ప్రతిష్టించాలని కమిషనర్ రాహుల్ మీనా పిలుపునిచ్చారు. వినాయక చవితి వేడుకలను పురస్కరించుకుని శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులు, ఉద్యోగులకు మట్టి ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నగర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్రజలు ఈ పండుగను కుటుంబసభ్యులతో ఆనందంగా జరుపుకోవాలని, పర్యావరణహిత వినాయక చవితి వేడుకల కోసం మట్టి గణపతి ప్రతిమలతో పండుగను నిర్వహించుకోవాలని సూచించారు.

వివిధ రకాల రసాయనాలు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన విగ్రహాలతో కాలుష్యం పెరిగి పర్యావరణానికి, జలవనరులకు పెనుముప్పుగా మారుతుందన్నారు. కనుక ప్రజలు సహజసిద్ధమైన మట్టిప్రతిమలను వినియోగించి.. భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలని కోరారు. కార్యక్రమంలో నగరపాలక అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

RAGHAVENDRA, RAJUMUNDRY CITY