P Gannavaram: ఈనెల 9న పి.గన్నవరంలో సీఎం చంద్రబాబు పర్యటన!

P Gannavaram: ఈనెల 9న అంబాజీపేటలో సీఎం చంద్రబాబు పర్యటన. రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ చేయనున్న సీఎం. ఏర్పాట్లపై ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సమీక్ష.

RAJU, P GANNAVARAM
Published on: 7 Sept 2026 1:27 PM IST
P Gannavaram
X

P Gannavaram: ఈనెల 9న పి.గన్నవరంలో సీఎం చంద్రబాబు పర్యటన!

P Gannavaram: అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం నియోజకవర్గం, అంబాజీపేట మండలంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈనెల 9వ తేదీన పర్యటించి, రైతులకు పట్టాదారు పుస్తకాలను అందజేయమన్నారు.

ఈ పర్యటన సందర్భంగా కూటమి పార్టీల నేతలతో పి.గన్నవరంలో ఎమ్మెల్యే గడ్డి సత్యనారాయణ సమావేశం నిర్వహించారు. ఈ పర్యటనను విజయవంతం చేయాలని నేతలకు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

ముఖ్యమంత్రి సమావేశానికి భారీగా జన సమీకరణ చేస్తున్నట్లు తెలియజేశారు. నియోజవర్గంలో ఉన్న ప్రతి సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు.

RAJU, P GANNAVARAM

RAJU, P GANNAVARAM