Polavaram: ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ రద్దు.. కలెక్టర్ ప్రకటన!
Polavaram: సీఎం చంద్రబాబు పోలవరం పర్యటన కారణంగా జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) రద్దయిందని, 1100 నంబర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని కలెక్టర్ తెలిపారు.
Polavaram: ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ రద్దు.. కలెక్టర్ ప్రకటన!
పోలవరం: రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో జూలై 13 సోమవారం పర్యటించి హైడ్రో పవర్ ప్రాజెక్టు పనులను పరిశీలించనున్న నేపథ్యంలో, అధికారులంతా విధుల్లో పాల్గొనాల్సి ఉన్నందున జూలై 13 (సోమవారం) నిర్వహించాల్సిన *ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)*ను రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రజలు తమ సమస్యలు, ఫిర్యాదులను 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా లేదా మీసేవ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నేరుగా నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ సూచించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
అదేవిధంగా, పలు ప్రభుత్వ పౌర సేవలను త్వరితగతిన పొందేందుకు వాట్సాప్ గవర్నెన్స్ నంబర్ 95523 00009ను కూడా వినియోగించుకోవచ్చని తెలిపారు.




