Amalapuram: అమలాపురంలో కలకలం బట్టల అలమరలోకి దూరిన గోధుమ తాచుపాము!

Amalapuram: అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణం గొల్లగూడెంలో ఓ ఇంట్లోని బట్టల అలమరలోకి గోధుమ తాచుపాము దూరి కలకలం రేపింది.

SURESH, AMALAPURAM
Published on: 18 Aug 2026 6:10 PM IST
Amalapuram
X

Amalapuram: అమలాపురంలో కలకలం బట్టల అలమరలోకి దూరిన గోధుమ తాచుపాము!

అమలాపురం: అమలాపురం పట్టణంలోని గొల్లగూడెం, కృష్ణుడి గుడి పక్కన ఉన్న రోడ్డులో ఓ ఇంట్లోకి పాము ప్రవేశించడంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. మందపాటి మూర్తి నివాసంలో అద్దెకు ఉంటున్న కుటుంబ సభ్యులు బట్టలు సర్దుకునేందుకు ఆలమర తెరవగా అందులో గోధుమ తాచుపాము కనిపించింది.

ఒక్కసారిగా పాము కనిపించడంతో వారు భయంతో బయటకు పరుగులు తీశారు.వెంటనే స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న గణేష్ వర్మ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని,జాగ్రత్తగా పామును పట్టుకున్నారు.అనంతరం పామును సురక్షితంగా డబ్బాలో బంధించారు.

ఈ సందర్భంగా స్నేక్ క్యాచర్ గణేష్ వర్మ మాట్లాడుతూ కోనసీమ ప్రాంతంలో ప్రస్తుతం పాముల సంచారం ఎక్కువగా కనిపిస్తోందని తెలిపారు.ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని,బట్టలు,సామగ్రి కదిలించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఇళ్లలోకి పాములు ప్రవేశించినప్పుడు ప్రజలు భయపడి వాటిని చంపే ప్రయత్నం చేయకుండా,వెంటనే స్నేక్ క్యాచర్లకు లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని అక్కడ ఉన్న ప్రజలకు గణేష్ వర్మ కోరారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM

Next Story