Amalapuram: అంతర్జాతీయ తీరప్రాంత పరిశుభ్ర దినోత్సవంలో ఎమ్మెల్యే ఆనందరావు!
Amalapuram: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్.యానాం కోకో బీచ్‌ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్న ఎమ్మెల్యే ఆనందరావు.
Amalapuram: అంతర్జాతీయ తీరప్రాంత పరిశుభ్ర దినోత్సవంలో ఎమ్మెల్యే ఆనందరావు!
Amalapuram: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయకత్వంలోనే రాష్ట్రంలో నిరంతర అభివృద్ధి జరుగుతుంది అని ఎమ్మెల్యే అన్నారు.కేంద్ర ప్రభుత్వ పృథ్వీ విజ్ఞాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (NIOT) నిర్వహణలో ఎస్.యానాం ఆంధ్రా గోవా కోకో బీచ్ వద్ద జరిగిన అంతర్జాతీయ తీరప్రాంత పరిశుభ్ర దినోత్సవం - 2026 (International Coastal Clean-Up Day-2026 - Clean Coast, Safe Sea)" కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పరిశుభ్రమైన తీరం - సురక్షితమైన సముద్రం అనే లక్ష్యంతో సముద్ర తీర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు.సముద్ర తీరంలో ప్లాస్టిక్ వ్యర్థాలు,చెత్తను వేయకుండా నిరోధించడం ద్వారా సముద్ర జీవులను పరిరక్షించవచ్చని,అలాగే తీరప్రాంత పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవచ్చని తెలిపారు.
మన తీరప్రాంతం ఎల్లప్పుడూ సుందరంగా, సురక్షితంగా ఉండేలా చూడటం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పిలుపునిచ్చారు.కో..కో.. బీచ్ భద్రత, పర్యవేక్షణ కోసం 4 అంతస్తులతో కూడిన ఆధునిక వాచ్ టవర్ నిర్మిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఇందులో ప్రతి అంతస్తులో మానిటరింగ్, సెక్యూరిటీ,స్టోర్ రూమ్‌లు ఏర్పాటు చేయడమే కాకుండా,అత్యున్నత అంతస్తులో బైనాక్యులర్స్ అమర్చి సముద్ర తీరంలో తిరిగే బోట్లను ప్రత్యక్షంగా వీక్షించే వెసులుబాటు కల్పిస్తున్నామని వివరించారు.
ప్రజా వినోదం కోసం సంక్రాంతి సంబరాలు, మహిళా బీచ్ వాలీబాల్ పోటీలు ఇక్కడ ప్రారంభించామని,దీనిద్వారా స్థానిక యువతకు,వ్యాపారులకు ఎంతోమందికి ఉపాధి లభించిందని చెప్పారు. భవిష్యత్తులో విదేశీ పర్యాటకులను కూడా ఆకర్షించేలా రిసార్ట్‌లు, వసతి గదులు ఏర్పాటు చేయాలనేది తన ఆలోచన అని వెల్లడించారు.
గతంలో నేను మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ బీచ్ అభివృద్ధిలో భాగంగా ఒక రెస్టారెంట్‌ను నిర్మించానని, అయితే గత పాలకులు దానిని పూర్తిగా నిరుపయోగం చేసి పక్కన పడేసారని గుర్తుచేశారు.గతంలో ఎంతోమంది ఎమ్మెల్యేలు ఉన్నా ఈ బీచ్‌ను పట్టించుకోలేదని,తాను రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాక మళ్లీ బీచ్ అభివృద్ధి పనులను వేగవంతం చేశానని తెలిపారు.ఈ బీచ్‌తో పాటు నియోజకవర్గంలో అభివృద్ధి నిరంతరం కొనసాగాలంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం రాష్ట్రానికి ఎంతో అవసరమని, మనమందరం బాబుని మళ్లీ గెలిపించుకుని అభివృద్ధి బాటలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
తీరప్రాంతాల పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తూ,ప్రజల భాగస్వామ్యంతో కోకో బీచ్‌ను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు,స్థానిక కూటమి కార్యకర్తలు, నాయకులు,అధికారులు,పర్యాటకులు, ప్రజలు అధికసంఖ్యలో పాల్గొన్నారు.




