Rampachodavaram: పోలవరం జిల్లాలో ఘనంగా తొలి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు!
Rampachodavaram: నూతన పోలవరం జిల్లా కేంద్రంలో తొలి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ జెండాను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్.
Rampachodavaram: పోలవరం జిల్లాలో ఘనంగా తొలి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు!
Rampachodavaram: నూతన పోలవరం జిల్లాలో ఘనంగా తొలి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు పోలవరం జిల్లా కేంద్రంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
నూతనంగా ఏర్పడిన పోలవరం జిల్లాలో తొలిసారిగా నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా కలెక్టర్ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు.అనంతరం పోలీసు సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో నిర్వహించిన పరేడ్‌ను కలెక్టర్ దినేష్ కుమార్ సందర్శించారు. పరేడ్ గౌరవ వందనాన్ని స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పోలవరం జిల్లా ఏర్పాటైన అనంతరం తొలిసారిగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహించుకోవడం ఎంతో ఆనందదాయకంగా ఉందన్నారు.జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు.
గత ఏడాది కాలంలో జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కలెక్టర్ వివరించారు.ప్రజలకు మెరుగైన ప్రభుత్వ సేవలు అందించడంతో పాటు మౌలిక వసతుల అభివృద్ధి, గిరిజన ప్రాంతాల సంక్షేమం, విద్య, వైద్యం, వ్యవసాయం తదితర రంగాల్లో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు.
నూతన పోలవరం జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేయడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజల సహకారంతో ముందుకు సాగుతామని కలెక్టర్ దినేష్ కుమార్ పేర్కొన్నారు.




