Konaseema: ఓడలరేవు తీర రక్షణకు గ్రోయిన్‌ల నిర్మాణం.. కలెక్టర్ సమీక్ష!

Konaseema: కోనసీమ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్. మహేష్ కుమార్ ఓడలరేవు తీర రక్షణ, ఓఎన్‌జీసీ ప్రాజెక్టుల అటవీ అనుమతులపై సమీక్షించారు.

SURESH, AMALAPURAM
Published on: 30 July 2026 11:27 PM IST
Konaseema
X

Konaseema: ఓడలరేవు తీర రక్షణకు గ్రోయిన్‌ల నిర్మాణం.. కలెక్టర్ సమీక్ష!

కోనసీమ: ఓడలరేవు తీర రక్షణ,ఓఎన్‌జీసీ ప్రాజెక్టుల అటవీ అనుమతుల ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ రావిరాల మహేష్ కుమార్ తెలిపారు.గురువారం అమరావతి నుండి అదనపు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ అధ్యక్షతన కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అటవీశాఖ అధికారులు ఓ ఎన్ జి సి ప్రతినిధులు విశాఖపట్నం రాజమహేంద్రవరం అటవీ పరిరక్షణ అధికారులు డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్లు తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఓడలరేవు తీర ప్రాంత రక్షణ చర్యలు అటవీ అనుమతుల పురోగతిపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఓఎన్‌జీసీ చేపట్టనున్న పైప్‌లైన్ డ్రైన్స్ నిర్మాణ ప్రతిపాదన, ఓడలారేవు తీరప్రాంత రక్షణ చర్యలు,అటవీ అనుమతుల ప్రక్రియ పురోగతిపై సమగ్రంగా చర్చించారు.ఓఎన్‌జీసీ ప్రతిపాదనకు సంబంధించి ఆన్‌లైన్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేసిన అథెంటికేటెడ్ కేఎంఎల్ షేప్ ఫైల్స్‌లో ఉన్న లోపాలను వెంటనే సరిదిద్దాలని ఆదేశించారు.అలాగే ప్రతిపాదనలో పొరపాటున నమోదైన 26 హెక్టార్ల విస్తీర్ణాన్ని సరిచేసి 26 ఎకరాలుగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్,ఓఎన్‌జీసీ అధికారులకు స్పష్టం చేశారు.

అవసరమైన సవరణలు పూర్తి చేసి రెండు రోజుల్లో నివేదికను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని వినియోగ సంస్థను ఆదేశిస్తూ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు.జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించిన అటవీ అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయడానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఓడలారేవు తీరప్రాంత రక్షణ కోసం చేపట్టనున్న గ్రోయిన్‌ల నిర్మాణం,ఓఎన్‌జీసీ పైప్‌లైన్ డ్రైన్స్ నిర్మాణం వంటి ప్రాజెక్టులు ప్రజా ప్రయోజనాలకు,తీరప్రాంత భద్రతకు ఎంతో కీలకమని పేర్కొన్నారు.అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి అటవీ అనుమతుల ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని,తద్వారా అభివృద్ధి పనులు నిర్ణీత గడువులో ప్రారంభమయ్యేలా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని పత్రాలు, సాంకేతిక వివరాలు,మ్యాపులు తదితర సమాచారాన్ని పూర్తిస్థాయిలో సిద్ధం చేసి సమర్పించడం ద్వారా అటవీ అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని సమావేశంలో అధికారులు నిర్ణయించారు.ఈ సమావేశంలో జిల్లా ఫారెస్ట్ శాఖ అధికారి ఎం వి ప్రసాద్ రావు ఓఎన్జిసి ప్రతినిధులు ఆర్ వెంకటయ్య సిజిఎం ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్లు ఆకాష్,రోహన్ తదితరులు పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM

Next Story