Rampachodavaram: తడి పొడి చెత్తతో ఎరువుల తయారీపై ఫోకస్ పెట్టండి కలెక్టర్

Rampachodavaram: కె. దినేష్ కుమార్ చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. తడి, పొడి చెత్తతో ఎరువులు తయారు చేసి పంచాయతీలను అభివృద్ధి చేయాలన్నారు.

Prasanna, Rampachodavaram
Published on: 9 July 2026 4:29 PM IST
Rampachodavaram
X

Rampachodavaram: తడి పొడి చెత్తతో ఎరువుల తయారీపై ఫోకస్ పెట్టండి కలెక్టర్

రంపచోడవరం: ప్రతిరోజు పంచాయతీలలో వచ్చే తడి చెత్త పొడి చెత్తను డంపింగ్ యార్డ్ లలో నిలువచేసి ఎరువులు తయారు చేసిన ఎడల సంబంధిత పంచాయతీలు అభివృద్ధికి దోహదపడతాయని పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ పేర్కొన్నారు. గురువారం స్థానిక డంపింగ్ యార్డ్ ను, చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా పోలవరం జిల్లా కలెక్టర్ కె.దినేష్ కుమార్ మాట్లాడుతూ ప్రతిరోజు పంచాయితీలో సేకరించిన తడి చెత్త పొడి చెత్తని వేరువేరుగా చేసిన అనంతరం ఎరువుగా తయారుచేసిన యెడల పకృతి వ్యవసాయం చేయు రైతులు కొనుగోలు చేస్తారని ఆయన అన్నారు. పంచాయతీలోని అధికారులు సంబంధిత డంపింగ్ యార్డ్ లో చెత్త ద్వారా ఎరువులు తయారు చేసే విధంగా దృష్టి పెట్టాలని ఆయన అన్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు సంపదను సృష్టించే అవకాశాలను పూర్తిగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు.

డంపింగ్ యార్డ్ లలో ఎక్కడ చెత్త పేరుకు పోకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరిచే చర్యలు చేపట్టి దుర్వాసన దోమలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. పరిసరాల ప్రాంతాలను శుభ్రంగా ఉంచుతూ వ్యర్థాలను నిర్లక్ష్యానికి తావు లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆయన అన్నారు.

జిల్లాలో ప్రతి గ్రామంలో పొడి చెత్త తడి చెత్త వేరువేరుగా చేసి ఇవ్వాలనే ఆయా గ్రామాలలో అవగాహన కల్పించాలని ఆయన అన్నారు.తడి చెత్త పొడి చెత్తను వేరుగా సేకరించే విధానం, వ్యర్ధాల శుద్ధి, కంపోస్ట్ తయారీ ప్రక్రియ, ప్లాస్టిక్ వ్యర్ధాల నిర్వహణ,నిల్వ, పారిశుద్ధ్య చర్యలను కలెక్టర్ పరిశీలించి అధికారులకు తగు సూచనలు ఇవ్వడం జరిగింది.

జిల్లా కలెక్టర్ వారి వెంట జిల్లా రెవిన్యూ అధికారి పి.అంబేద్కర్, రెవిన్యూ డివిజనల్ అధికారి కె.స్వాతి, సబ్ డివిజనల్ పోలీస్ అధికారి అస్రఫ్ అలీ, డిఇఓ జి.శ్రీరామ్ మూర్తి, ఈఈ ఐ. శ్రీనివాసరావు, తాసిల్దార్ సిహెచ్. బాలాజీ,డి ఎల్ పి ఓ రాధాకృష్ణ, ఎంపీడీవో ప్రసాద్, డిప్యూటీ ఎంపీడీవో హరిబాబు,డి. భవాని తదితరులు పాల్గొన్నారు.

Prasanna, Rampachodavaram

Prasanna, Rampachodavaram

Next Story