Rajahmundry: పోషకాహారంతో తల్లులు, పిల్లల ఆరోగ్య భరోసా!

Rajahmundry: రాజమండ్రి రూరల్ వేమగిరి అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ మాసం సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి గర్భిణులు, బాలింతలతో ముఖాముఖి నిర్వహించారు.

S POSAYYA, RAJUMUNDRY RURAL
Published on: 18 Sept 2026 8:17 AM IST
Rajahmundry
X

Rajahmundry: పోషకాహారంతో తల్లులు, పిల్లల ఆరోగ్య భరోసా!

Rajahmundry: పోషణ మాసం సందర్భంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపడంతో పాటు బలవర్ధకమైన, పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను తీసుకునేలా అవగాహన కల్పించడమే కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు.

గురువారం సాయంత్రం కడియం మండలం వేమగిరి గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ అక్కడి గర్భిణులు, బాలింతలతో ముఖాముఖి నిర్వహించి వారి ఆరోగ్యం, పోషకాహారంపై మాట్లాడారు

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటించడం ద్వారా తల్లులు, పిల్లలు ఆరోగ్యంగా ఉండేలా సందేశాత్మక రీతిలో చైతన్యం తీసుకురావాలని సూచించారు.

రక్తహీనత నివారణకు ఆకుకూరలు తీసుకోవాలి*

గర్భిణులు, బాలింతల్లో హిమోగ్లోబిన్ స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు అలసట, ఆయాసం, గుండె దడ వంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు.

రక్తహీనతను నివారించేందుకు పాలకూర, తోటకూర, కరివేపాకు తదితర ఆకుకూరలతో పాటు ఇనుము, పోషక విలువలు కలిగిన ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలని సూచించారు.

బాలింతలు తగినంత పోషకాహారం తీసుకోవడం ద్వారా తమ ఆరోగ్యంతో పాటు శిశువుల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చని తెలిపారు. హిమోగ్లోబిన్ స్థాయిలను వైద్యుల సూచనల మేరకు ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలని సూచించారు.

పిల్లలతో తల్లిదండ్రులు సమయం గడపాలిచిన్నారులకు బిస్కెట్లు, చాక్లెట్లు వంటి అధిక చక్కెర కలిగిన పదార్థాలను తరచుగా ఇవ్వకుండా,ఆరోగ్యకరమైన పోషకాహారాన్నిఅందించాలని కలెక్టర్ సూచించారు.

పిల్లలు ఎక్కువ సమయం మొబైల్ ఫోన్ చూడకుండా తల్లిదండ్రులు వారితో సమయం గడుపుతూ ఆటలు, సంభాషణలు, మంచి అలవాట్ల వైపు ప్రోత్సహించాలని తెలిపారు.

పోషణ మాసం లక్ష్యాలను వివరించిన ICDS ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ పోషణ మాసం సందర్భంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార ప్రాధాన్యతపై గ్రామ స్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం, వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణ, చిన్నారుల ఎదుగుదలపై తల్లులకు నిరంతరం అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు.

గర్భిణులు, బాలింతలు తమ ఆరోగ్య సమస్యలను అంగన్‌వాడీ, వైద్య సిబ్బంది దృష్టికి తీసుకువచ్చి అవసరమైన వైద్య సలహాలు పొందాలని సూచించారు.

సీమంతం కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్

ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి గర్భిణీ మహిళల కోసం నిర్వహించిన సీమంతం కార్యక్రమంలో పాల్గొని వారిని ఆశీర్వదించారు.చిన్నారులకు స్కూల్ బ్యాగులను అందజేశారు. అంగన్‌వాడీ కేంద్రంలో అందిస్తున్న సేవలు, పిల్లలకు అందుతున్న పోషకాహారం తదితర అంశాలను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో ICDS PD శ్రీదేవి, ICDS అధికారులు, అంగన్‌వాడీ సిబ్బంది, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది, గర్భిణులు, బాలింతలు, తల్లులు, చిన్నారులు పాల్గొన్నరు.

S POSAYYA, RAJUMUNDRY RURAL

S POSAYYA, RAJUMUNDRY RURAL