Draksharama: ద్రాక్షారామలో కలెక్టర్ మహేష్ కుమార్ పర్యటన పింఛన్ల పంపిణీ

Draksharama: ద్రాక్షారామలో కలెక్టర్ మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా తనిఖీలు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ, ఎరువుల కొరతపై ప్రభుత్వానికి నివేదిక.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 1 July 2026 7:53 PM IST
Draksharama
X

Draksharama: ద్రాక్షారామలో కలెక్టర్ మహేష్ కుమార్ పర్యటన పింఛన్ల పంపిణీ

ద్రాక్షారామ: ద్రాక్షారామ నూతనంగా నిర్మించనున్న పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి సంబంధించిన స్థలాన్ని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా తో కలిసి పరిశీలించిన కలెక్టర్ మహేష్ కుమార్. పి ఏ సి ఎస్ (సొసైటీ ) లో పంపిణీ చేస్తున్న డిఎపి(ఎరువులు) విధానాన్ని పరిశీలించి రైతులు, సిబ్బందితో మాట్లాడిన కలెక్టర్. అనంతరం జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ..

గ్రామంలో సొసైటీ ద్వారా రైతులకు సరఫరా చేస్తున్న ఎరువులపై ఆరా తీసా కొత్త పోర్టల్ లో యాప్ ద్వారా రైతులకు డి ఏ పీ(ఎరువులు ) ని ఎలా సరఫరా చేస్తున్నారని ఆపరేటర్లను ప్రశ్నించి, ఇందులో తలెత్తే సమస్య లు పై రైతులతో చర్చించా గతంలో ఎకరాకు బస్తా డిఏపి ఇచ్చే వారని, ప్రస్తుతం ఎకరాకు అర బస్తా డీఏపీ మాత్రమే ఇస్తున్నారని రైతులు తమ దృష్టికి తీసుకొచ్చారని, ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానన్న కలెక్టర్.

ప్రభుత్వం ద్రాక్షారామలో కొత్తగా పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి శాంక్షన్ ఇచ్చిన నేపథ్యంలో ఇక్కడున్న గ్రామ కంఠభూమిని గుర్తించామన్న కలెక్టర్. అసంపూర్తి గా ఉన్న ఇండోర్ స్టేడియం భవనానికి 50 లక్షలు మంజూరు చేశారని, వీటితోపాటు సిఎస్ ఆర్ ఫండ్ నుంచి నిధులు కేటాయించి ఇండో ర్ స్టేడియంను రెండు మూడు నెలల్లో వినియోగం లోకి తీసుకొస్తామన్న జిల్లా కలెక్టర్.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story