Rajahmundry: రాజమండ్రిలో ఇంటింటికీ ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ!

Rajahmundry: రాజమండ్రి విద్యుత్ కాలనీలో సచివాలయ ఉద్యోగులతో కలిసి ఇంటింటికి వెళ్లి ఫేస్ రికగ్నిషన్ ద్వారా పింఛన్లు పంపిణీ చేసిన కమిషనర్ రాహుల్ మీనా.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY
Published on: 1 Oct 2026 5:25 PM IST
Rajahmundry
X

Rajahmundry: రాజమండ్రిలో ఇంటింటికీ ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ!

Rajahmundry: అర్హులైన వారందరికీ ప్రభుత్వం పారదర్శకంగా పింఛన్లను పంపిణీ చేస్తున్నట్లు కమిషనర్ రాహుల్ మీనా పేర్కొన్నారు. గురువారం ఉదయం సచివాలయ ఉద్యోగులతో కలిసి విద్యుత్ కాలనీలో ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఆధార్ కార్డులను పరిశీలించి, ఫేస్ రికగ్నిషన్ సిస్టం ద్వారా చెక్ చేసి పింఛన్ డబ్బులు అందించారు. కేటగిరీల వారీగా లబ్ధిదారులకు పింఛన్ మొత్తాన్ని అందిస్తున్న తీరును పరిశీలించారు.

ఈ సందర్భంగా పింఛన్ దారులతో స్నేహపూర్వకంగా మాట్లాడుతూ.. వారికి అందుతున్న సౌకర్యాలు, పింఛన్ సాయం ఏవిధంగా ఉపయోగపడుతుందో అడిగి తెలుసుకున్నారు. పెన్షన్ దారులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. ప్రభుత్వం చేస్తున్న సేవలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ ప్రతినెలా ఒకటో తేదీనే పింఛన్లు పంపిణీకి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు.

అర్బన్ పరిధిలో పింఛన్ల పంపిణీ నిర్దిష్టంగా ఒకటవ తేదీ ఉదయం నుంచి ప్రారంభం అయిందని లబ్ధిదారులు ఎక్కడా అసౌకర్యానికి గురికాకుండా ఉదయం 6 గంటల నుండి సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి ప్రశాంత వాతావరణంలో పింఛన్లు అందజేస్తున్నట్లు వెల్లడించారు. అక్టోబర్ నెలకు సంబంధించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందించే క్రమంలో నగరంలో 27,153 మంది పింఛనుదారులకు ప్రభుత్వం 11 కోట్ల 98 లక్షల 76 వేల 500 రూపాయలు విడుదల చేసిందన్నారు.

సాయంత్రానికల్లా పంపిణీ కార్యక్రమం అత్యంత పారదర్శకంగా, శత శాతం పూర్తిచేయవలసిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

RAGHAVENDRA, RAJUMUNDRY CITY