Rajahmundry: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక రోజు రిలే నిరాహార దీక్ష!
Rajahmundry: పేపర్ లీకేజీలపై కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక రోజు రిలే నిరాహార దీక్ష నిర్వహించారు.
Rajahmundry: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక రోజు రిలే నిరాహార దీక్ష!
రాజమండ్రి: ఎఐసిసి ఆదేశాల మేరకు పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిళారెడ్డి సూచనలతో ఢిల్లీలో జరుగుతున్న విద్యార్థుల పోరాటానికి మద్ధతుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక రోజు రిలే నిరాహార దీక్ష శనివారం నిర్వహించారు. స్థానిక గోకవరం బస్టాండ్ గాంధీ విగ్రహం వద్ద ప్రత్యేకంగా శిబిరం ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు, విద్యార్థులు ఈ నిరసన దీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా పిసిసి మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు అమర్ జహా బేగం, కాంగ్రెస్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్, రాజమండ్రి పార్లమెంట్ కో ఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, కాంగ్రెస్ నిడదవోలు కో ఆర్డినేటర్ మేడవరపు భద్రం దొర, వారికి మద్ధతుగా జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ అల్లు బాబీ మాట్లాడారు. విద్యార్థుల పరీక్షలను కూడా సమర్ధవంతంగా నిర్వహించలేదని దుస్థితిలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఉన్నా.. లేకపోయినా ఒకటేనని ఆగ్రహం వ్యక్తం చేసారు.
ప్రధాని మోదీ పాలనలోకి వచ్చిన తరువాత 152 సార్లు ఎన్‌టిఎ ఆధ్వర్యంలో జరిగిన ప్రశ్నా పత్రాలు లీకయ్యాయని, దాని వల్ల లక్షలాది మంది విద్యార్థుల భవితవ్యం రోడ్డున పడిందని అందోళన వ్యక్తం చేసారు. విద్యార్థులకు మద్ధతుగా ఢిల్లీలో ఆందోళన చేపట్టిన లోక్‌సభా పక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీని కూడా పోలీసులు దారుణంగా దౌర్జన్యంగా అరెస్టు చేసారని మండిపడ్డారు. విద్యార్థుల ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్ధతు ప్రకటిస్తుందన్నారు.
కేంద్ర విద్యాశాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో పాటు ఎన్‌టిఎను రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేసారు. 22 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని వారి కుటుంబాలకు కోటి రూపాయల చొప్ప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసారు. విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసేలా కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ పనితీరు ఉందని దుయ్యబట్టారు. అల్లు బాబీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటే తనకు అభిమానమని అందుకే వారి దీక్షా శిబిరానికి వచ్చి మద్ధతు పలికానని తెలిపారు.
కేంద్ర పాలకుల తీరు కారణంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతోందని ఆందోళన వ్యక్తం చేసారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మోతా శారత, తాడి సూరిబాబు, తాడాల కొండరాజు, యేసు, సాకా పుల్లారావు, డాక్టర్ యాళ్ల వీరభద్రరావు, శ్రీనివాస్ వడియార్, సింధియారాణి, ఆలీ, కిశోర్‌కుమార్ జైన్ తదితరులు పాల్గొన్నారు.




