Rajamahendravaram: ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు!
Rajamahendravaram: రాజమండ్రిలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులర్పించారు.
Rajamahendravaram: ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు!
Rajamahendravaram: భారత దేశం నేడు ప్రపంచ దేశాల సరసన ప్రగతి పథంలో ముందుకు సాగుతుందంటే దానికి ప్రధాన కారణం మాజీ ప్రధాని, భారత రత్న రాజీవ్ గాంధీయేనని కాంగ్రెస్ రాజమండ్రి పార్లమెంట్ కో ఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, అర్బన్ జిల్లా అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ అన్నారు.
రాజీవ్ గాంధీ ఆనాడు విప్లవాత్మక సంస్కరణలు అమలు చేసి శాస్త్ర సాంకేతిక రంగాలను ఎంతో అభివృద్ధి చేసారని కొనియాడారు. రాజీవ్ గాంధీ 82వ జయంతి సందర్భంగా స్థానిక సీతం పేట పార్కులో ఉన్న ఆయన విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
టీకే, బాలేపల్లితో మాటు పిసిసి ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్, బెజవాడ రంగారావు తదితరులు మాట్లాడారు. అతి చిన్న వయసులోనే ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్ గాంధీ యువతరాన్ని ప్రోత్సహించడానికి ఎంతో కృషిచేసారన్నారు.
18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించడం, కంప్యూటర్ రంగాన్ని పరిచయం చేయడం దేశాభివృద్ధిలో కీలక పరిణామాలు అన్నారు. రాజ్యాంగంలోని 73, 74 ఆర్టికల్స్ సవరించి నేరుగా గ్రామ పంచాయతీలకు కేంద్రం ద్వారా నిధులు ఇచ్చి గ్రామాల అభివృద్ధికి పెద్ద పీట వేసారన్నారు.
ఆయనకు రాజమండ్రి నగరంతో ఎంతో అనుuంధం ఉందని టీకే గుర్తు చేసారు. దేశవ్యాప్తంగా ప్రజలందరూ రాజీవ్ గాంధీకి ఘనంగా నివాళులర్పిస్తున్నారన్నారు. ఆయన త్యాగాలను స్మరించుకుంటూ ఇక్కడ పార్కు ఏర్పాటు చేసి విగ్రహాన్ని ప్రతిష్టించామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ విధానాలు కూడా ప్రజలకు తెలియచేయాల్సి ఉందన్నారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగకపోతే నిధులు రావన్నారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగకుండా చేసి వచ్చే నిధుల్ని ప్రజా ప్రతినిధులు స్వాహా చేయాలని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.
కార్పొరేటర్లు ఉంటే అన్ని డివిజన్లు అభివృద్ధి చెందుతాయని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వేల కోట్ల నిధులు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. కోర్టులో కేసు ఉందని మెలిక పెడుతున్నారని, కేసు వేసిన రెండు గ్రామాల వారు వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు.
అలా జరగని పక్షంలో తానే హైకోర్టుకి వెళ్లి ఎన్నికలు జరిగేలా న్యాయ పోరాటం చేస్తానని వెల్లడించారు. అనంతరం పేదలకు రగ్గులు పంపిణీ చేసారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు డాక్టర్ రాజశేఖర్, బత్తిన చంద్రరావు, సాకా పుల్లారావు, తాడి సూరిబాబు, బర్రే సుబ్రహ్మణ్యం, నిల్లా వీర్రాజు, సింధియా రాణి, ఆలీ తదితరులు పాల్గొన్నారు.




