Sakhinetipalli: అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం భూముల్లో మట్టి వివాదం

Sakhinetipalli: అంతర్వేది ఆలయ భూముల నుంచి అక్రమంగా మట్టి తరలింపుపై వివాదం. కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూరుస్తూ దేవస్థానానికి ఆదాయ నష్టం కలిగిస్తున్నారని ఆగ్రహం.

PRABHU, RAZOLE
Published on: 1 July 2026 2:26 PM IST
Sakhinetipalli
X

Sakhinetipalli: అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం భూముల్లో మట్టి వివాదం

సఖినేటిపల్లి: డాక్టర్ .బీఆర్ .అంబేడ్కర్ కోనసీమ జిల్లా,సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం భూముల నుంచి మట్టి తరలింపు వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఈ వ్యవహారంలో సంబంధిత అధికారుల తీరుపై స్థానికుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అంతర్వేది దేవాలయ పరిసరాలలో పలు అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.2 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఇందులో భాగంగా ఆలయం వెనుక డార్మెటరీ నిర్మాణానికి కాంట్రాక్టు కేటాయించారు. అయితే నిర్మాణ స్థలం పల్లపు ప్రాంతంలో ఉండటంతో సోయిల్ ఫిల్లింగ్ అవసరమైంది.

ఇటీవల దేవస్థానం భూమిలో అక్రమంగా చెరువు తవ్వుతున్నారనే ఆరోపణలతో అధికారులు ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని తవ్విన మట్టిని సీజ్ చేసినట్లు సమాచారం. అయితే దేవస్థానం పాలకమండలి లేదా సంబంధిత తీర్మానం లేకుండానే అదే మట్టిని ట్రాక్టర్ల ద్వారా డార్మెటరీ నిర్మాణ స్థలానికి తరలిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సోయిల్ ఫిల్లింగ్ బాధ్యత కాంట్రాక్టు ప్రకారం నిర్వహించాల్సిన కాంట్రాక్టర్‌కు బదులుగా దేవస్థానం మట్టినే వినియోగించడం వల్ల దేవస్థానానికి ఆదాయ నష్టం వాటిల్లే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ అంశంపై ఆలయ సహాయ కమిషనర్ (ఏసీ)ను ప్రశ్నించగా, పొంతనలేని సమాధానాలు చెపుతు, అవసరమైతే మట్టి తరలింపును నిలిపివేస్తామని చెప్పడం మరిన్ని అనుమానాలకు తావిస్తోందని స్థానికులు పేర్కొంటున్నారు.

ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి, దేవస్థానం ఆస్తులు, ఆదాయ ప్రయోజనాలను పరిరక్షించడంతో పాటు అక్రమాలు జరిగి ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story