Razole: రాజోలు వైఎస్సార్సీపీ పరిశీలకుడు దంగేటి రాంబాబుకు ఘన సన్మానం

Razole: రాజోలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ పరిశీలకులుగా నియమితులైన రాంబాబును పార్టీ కో-ఆర్డినేటర్ రాజేశ్వరి మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు.

PRABHU, RAZOLE
Published on: 17 July 2026 11:43 AM IST
Razole
X

Razole: రాజోలు వైఎస్సార్సీపీ పరిశీలకుడు దంగేటి రాంబాబుకు ఘన సన్మానం

రాజోలు: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజోలు నియోజకవర్గ పరిశీలకులుగా నియమితులైన దంగేటి రాంబాబు గారిని అమలాపురం నియోజకవర్గం లోని చల్లపల్లి గ్రామంలో వారి స్వగృహంలో రాజోలు నియోజకవర్గ పార్టీ కో-ఆర్డినేటర్, మాజీ శాసన సభ్యురాలు శ్రీమతి పాముల రాజేశ్వరి దేవి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా రాజేశ్వరి దేవి మాట్లాడుతూ, పార్టీ బలోపేతం కోసం దంగేటి రాంబాబు గారు సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తారని ఆకాంక్షించారు. రాజోలు నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ శ్రేణుల సమన్వయానికి ఆయన సేవలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సిఇసి సభ్యులు కే ఎస్ ఎన్ రాజు, రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి ప్రకాష్, రాష్ట్ర కార్యదర్శులు పాటి శివకుమార్, కటకంశెట్టి ఆదిత్య, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రుద్రరాజు చినరాజు, కంచర్ల శేఖర్, తెన్నేటి కిషోర్, పిప్పర రాజు, బోలిశెట్టి భగవాన్, అడబాల బ్రహ్మాజీ, కట్టా శ్రీనివాస్, ఈద రవిరెడ్డి,

కూనపరెడ్డి రాంబాబు, జాలెం జనార్దన్, యెనుమల నారాయణస్వామి, బల్ల శ్రీను, గెద్దాడ సత్యనారాయణ, చింత ప్రసాద్, మోకా సురేష్, మద్దుల కాసుబాబు, కంచి రమణ, ముప్పర్తి త్రిమూర్తులు, దార్ల పెదబాబు, బండారు కాశీ, అడబాల జానకిరావు, రాపాక శ్రీను (ఆర్‌.ఎస్‌), మున్నా, మహేంద్ర, కార్తీక్, చక్రి, బొక్క శ్రీను గార్లు తదితరులు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story