Rajahmundry: కాపు నేతలపై 2016 నాటి కేసు కొట్టివేత.. న్యాయస్థానం కీలక తీర్పు
Rajahmundry: కాపు రిజర్వేషన్ ఉద్యమాల సందర్భంగా 2016లో కడియం మండలానికి చెందిన పలువురు కాపు నాయకులపై నమోదైన కేసును రాజమహేంద్రవరం న్యాయస్థానం కొట్టివేసింది.
Rajahmundry: కాపు నేతలపై 2016 నాటి కేసు కొట్టివేత.. న్యాయస్థానం కీలక తీర్పు
Rajahmundry: కాపు ఉద్యమాల సందర్భంగా సెక్షన్ ఉల్లంఘించారనే ఆరోపణలతో 2016 లో కడియం మండలానికి చెందిన పలువురు కాపు నాయకుల పై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది.
గతంలో ఈ ఉద్యమాలకు సంబంధించిన కేసులను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసినప్పటికీ, సాంకేతిక కారణాల వల్ల 2026లో ఈ కేసు మళ్లీ విచారణకు వచ్చి, పలుమార్లు వాయిదాలు పడుతూ సాగింది. తాజాగా న్యాయస్థానం కేసును కొట్టివేయడంతో కాపు సోదరులు హర్షం వ్యక్తం చేశారు.
కేసు విచారణ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన కాపు నేతలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు కాపు నాయకులు మాట్లాడుతూ భవిష్యత్తులో సమాజ శ్రేయస్సు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం అందరూ కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు.
Next Story




