Razole: ఘనంగా చుండూరు దళిత మృతవీరుల నివాళులు!
Razole: కోనసీమ జిల్లా రాజోలు మండలం పొదలాడలో చుండూరు దళిత మృతవీరుల సంస్మరణ సభ నిర్వహించి, దళిత చైతన్య వేదిక నాయకులు ఘనంగా నివాళులర్పించారు.
Razole: ఘనంగా చుండూరు దళిత మృతవీరుల నివాళులు!
Razole: చుండూరు నరమేధంలో ప్రాణాలు కోల్పోయిన దళిత మృతవీరులకు దళిత చైతన్య వేదిక నాయకులు ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం పొదలాడ గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద గురువారం జిల్లా అధ్యక్షులు లిఖితపూడి బుజ్జి ఆధ్వర్యంలో చుండూరు దళిత మృతవీరుల సంస్మరణ సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా మృతవీరులకు రెండు నిమిషాల పాటు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం నల్లజెండాలు ప్రదర్శిస్తూ "దళిత మృతవీరులు అమర్ రహే", "జోహార్ చుండూరు దళిత మృతవీరులు" అంటూ నినాదాలు చేశారు.
నాయకులు మాట్లాడుతూ, ఆగస్టు 6 దళిత సమాజానికి మరచిపోలేని విషాద దినమని పేర్కొన్నారు. ఆధిపత్య వర్గాల కుల దురహంకారానికి వ్యతిరేకంగా పోరాడి ప్రాణత్యాగం చేసిన చుండూరు మృతవీరులను స్మరించుకుంటూ రాష్ట్ర దళిత సంఘాల పిలుపు మేరకు ఈ రోజును బ్లాక్ డేగా, ఆత్మగౌరవ పోరాట దినంగా పాటిస్తున్నట్లు తెలిపారు.
సమాజంలో దళితులపై వివక్ష ఇంకా కొనసాగుతోందని, రాజకీయ పార్టీలకు అతీతంగా దళితులందరూ మరో ఆత్మాభిమాన పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో దళిత చైతన్య వేదిక వ్యవస్థాపకులు బత్తుల మురళీకృష్ణ, డీహెచ్‌పీఎస్ జిల్లా అధ్యక్షులు దేవ రాజేంద్రప్రసాద్, దళిత సంఘాల కోఆర్డినేటర్ తోటే ప్రతాప్, ఉపాధ్యక్షులు చిలకపాటి శ్రీధర్, రాజోలు మండల అధ్యక్షులు మందపాటి మధు, మట్టా సురేష్, బుంగ శ్రీను, పొన్నమాటి భాస్కర్, ఉప్పే జగదీష్, బొడ్డపల్లి పుల్లయ్య, పాముల హర్షవర్ధన్, గోగి మోహన్, కారుపల్లి గోపాలన్, పోతుల బుజ్జి, చిత్రపు మున్నా, రొక్కం రాజారావు, విప్పర్తి మోజెస్, బత్తుల శేఖర్, పొన్నమాటి విలియం కేర్, పోతుల ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.




