Konaseema: కోనసీమలో దళిత సేన సేవా కార్యక్రమాలు.. విద్యార్థులకు అండ!
Konaseema: కోనసీమ జిల్లాలో దళిత సేన ఆధ్వర్యంలో 8 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు చెందిన 200 మంది విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులు, విద్యా సామాగ్రి పంపిణీ చేశారు.
Konaseema: కోనసీమలో దళిత సేన సేవా కార్యక్రమాలు.. విద్యార్థులకు అండ!
కోనసీమ: కోనసీమ జిల్లా పరిసరాల ప్రాంతాలలో దళిత సేన ఆధ్వర్యంలో 8 ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ 25 మంది చొప్పున 200 మంది విద్యార్థి విద్యార్థులకు ప్లేట్లు గ్లాసులు చదువుకు ఉపయోగపడే(పెన్సిల్, స్కేల్,ఎరేజర్,షార్ప్ మర,స్కెచ్ లు,2పుస్తకాలు, స్నాక్స్ బాక్స్,1వాటర్ బాటిల్) విధ్యా సామాగ్రి దళిత సేన సభ్యుల ద్వారా అందించడం జరిగింది.
ఈరోజు చివరగా అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి పంచాయతీ పరపేట లో* ఈ కార్యక్రమం నిర్వహించి స్థానిక పెద్దలు దళిత సభ్యులు చేత అందజేయడం జరిగింది. దళిత సేన చైర్మన్ మెండి డేవిడ్ అంబేద్కర్ మాట్లాడుతూ ఇటీవలే కాలమ దళిత సేన గ్రూపుని రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది.
100 మంది సభ్యులతో నెలకి 100 రూపాయలు చొప్పున దళిత సంస్థకు కట్టించి వచ్చిన అమౌంట్ తో అమలాపురం,పి.గన్నవరం, మండపేట,ముమ్మిడివరం ప్రాంతాలలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించటం జరుగుతుంది. డాక్టర్.బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో పే బ్యాక్ టు సొసైటీ అనే నినాదంతో ఈ సంస్థ ముందుకు వెళ్లడం జరుగుతుందని అన్నారు. ప్రతిచోట ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు దళిత సేన సంస్థను అభినందించారు.
ఈ కార్యక్రమంలో దళిత సేన చైర్మన్ మెండి డేవిడ్ అంబేద్కర్,దళిత సేన అధ్యక్షులు జిల్లెల్ల రమేష్, దళిత సేన గౌరవ అధ్యక్షులు వాకపల్లి హరీష్, దళిత సేన ట్రెజరర్ సాపే రమేష్,దళిత నాయకులు జంగా శ్రీను,దళిత సేన సభ్యులు గోసంగి సంతోష్,నల్లా విజయ్,నక్క రమేష్,మాదే విజయ్, బడుగు రాజు,గోసంగి జాకబ్ ప్రభు,కమిడి సామ్యేల్,కొల్లు పెద్దిరాజు,కొల్లు దాసు,గెడ్డం పల్లయ్య,గెద్దడి లక్ష్మణ్ రావు తదితులు పాల్గొన్నారు.




