Razole: మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి, లక్ష్యాల వైపు సాగాలి!
Razole: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా పోలీసు శాఖ సౌజన్యంతో మహిళా సహాయక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
Razole: మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి, లక్ష్యాల వైపు సాగాలి!
రాజోలు : డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా పోలీసు శాఖ సౌజన్యంతో మహిళా సహాయక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. సాయిబాబా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి అమలాపురం దిశ డీఎస్పీ షేక్ షాబ్జి అహ్మద్, కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా డీఎస్పీ షేక్ షాబ్జి అహ్మద్ మాట్లాడుతూ నేటి సమాజంలో చిన్నారులు, మహిళలపై లైంగిక వేధింపులు, గృహహింస, కట్న వేధింపులు, మానవ అక్రమ రవాణా (ట్రాఫికింగ్) వంటి సమస్యలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే యువత మాదకద్రవ్యాలకు బానిసై తమ భవిష్యత్తును నాశనం చేసుకోకుండా జాగ్రత్తపడాలని అవగాహన కల్పించారు.
కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ మాట్లాడుతూ, యువత నైతిక విలువలు, సామాజిక బాధ్యత, క్రమశిక్షణ, మంచి నడవడిక అలవర్చుకుని ఉన్నత లక్ష్యాలను సాధించే దిశగా ముందుకు సాగాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణమూర్తి, పీఆర్‌ఓ నల్లి రాజు, రాజోలు సీఐ సురేష్ బాబు, ఎస్సై మల్లికార్జున రెడ్డి, అధ్యాపకులు శైలజ, లావణ్య, మధుకుమార్ తో పాటు విద్యార్థిని విద్యార్థులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.




