Rampachodavaram: ఆర్ అండ్ ఆర్ కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ ఏర్పాటు చేయాలి

Rampachodavaram: Demand for Special Lok Adalat for Polavaram R&R Cases Rampachodavaram

Prasanna, Rampachodavaram
Published on: 10 Aug 2026 7:41 AM IST
Rampachodavaram
X

Rampachodavaram: ఆర్ అండ్ ఆర్ కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ ఏర్పాటు చేయాలి

Rampachodavaram: ఆర్ అండ్ ఆర్ కేసుల పరిష్కారానికి లోకదాలత్ ఏర్పాటు చేయాలని న్యాయ సేవలు సంఘం కార్యదర్శి కి వినతి పత్రం అందజేసిన బాలు అక్కిస.

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివారం రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయంలో తూర్పుగోదావరి జిల్లా న్యాయ సేవల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన లీగల్ అవేర్‌నెస్ క్యాంపులో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పెండింగ్‌లో ఉన్న పునరావాస, పునఃస్థాపన (ఆర్&ఆర్) కేసుల పరిష్కారానికి ప్రత్యేక లోక్ అదాలత్ ఏర్పాటు చేయాలని కోరుతూ హ్యూమన్ రైట్స్ వాచ్ డైరెక్టర్ బాలు అక్కిస జిల్లా న్యాయ సేవల సంస్థ కార్యదర్శికి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన సుమారు వెయ్యి ఆర్&ఆర్ కేసులు, క్లెయిమ్‌లు పెండింగ్‌లో ఉన్నాయని, నష్టపరిహారం, పునరావాస ప్రయోజనాలు, ఇళ్ల స్థలాల కేటాయింపు, అర్హతగల కుటుంబ హోదా, బకాయిల చెల్లింపులు తదితర అంశాలు పరిష్కారం కాక నిర్వాసిత కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు.

జిల్లా న్యాయ సేవల సంస్థ, పోలవరం ప్రాజెక్టు అధికారులు, రెవెన్యూ శాఖతో పాటు సంబంధిత విభాగాల సమన్వయంతో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తే చర్చలు, రాజీ, మధ్యవర్తిత్వం ద్వారా పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించే అవకాశం ఉంటుందని వినతిపత్రంలో వివరించామని తెలిపారు. దీంతో నిర్వాసిత కుటుంబాలు సుదీర్ఘ న్యాయపోరాటం లేకుండానే తమ చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాలు పొందగలరని తెలిపారు.

వినతిపత్రాన్ని స్వీకరించిన జిల్లా న్యాయ సేవల సంస్థ గౌరవ కార్యదర్శి స్పందిస్తూ, ఈ ప్రతిపాదనను హైకోర్టు అనుమతి కోసం పంపించి, అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చినట్లు బాలు అక్కిస తెలిపారు.

Prasanna, Rampachodavaram

Prasanna, Rampachodavaram

Next Story