Malikipuram: వర్షాకాలం వచ్చేసింది దోమల వ్యాధులపై వైద్య సిబ్బంది అలర్ట్
Malikipuram: మలికిపురంలో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పరిసరాల పరిశుభ్రతపై వైద్య సిబ్బంది ప్రజలకు పలు సూచనలు చేశారు.
Malikipuram: వర్షాకాలం వచ్చేసింది దోమల వ్యాధులపై వైద్య సిబ్బంది అలర్ట్
మలికిపురం: డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంలో భాగంగా డాక్టర్ .బీఆర్ .అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మలికిపురం గుబ్బలవారి గ్రూపులో సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, ఫైలేరియా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు. ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, ప్రతి శుక్రవారం 'ఫ్రైడే డ్రై డే' పాటిస్తూ నీటి నిల్వలను తొలగించాలని సూచించారు.
అలాగే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, దోమతెరలను వినియోగించడం, జ్వరం వచ్చిన వెంటనే సమీప వైద్య సిబ్బందిని సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ ఇళ్ల వెంకటరమణ (MPHA-M), MLHV బ్లెస్సీ, ANM మేరీ రత్నం, ఆశా కార్యకర్తలు మరియు ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.




