Malikipuram: గుబ్బలపాలెంలో డెంగ్యూపై అవగాహన!
Malikipuram: కోనసీమ జిల్లా గుబ్బలపాలెంలో కేశనపల్లి పీహెచ్‌సీ ఆధ్వర్యంలో డెంగ్యూ, మలేరియా నివారణా శిబిరం. దోమల నివారణపై వైద్య సిబ్బంది విస్తృత అవగాహన.
Malikipuram: గుబ్బలపాలెంలో డెంగ్యూపై అవగాహన!
Malikipuram: డెంగ్యూ మాసోత్సవాల సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (DMO) ఆదేశాల మేరకు డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మలికిపురం మండలం, కేశనపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) పరిధిలోని గుబ్బలపాలెం గ్రామంలో శనివారం డెంగ్యూ, మలేరియా, ఫైలేరియా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
SUO ఆదినారాయణ, MPHEO చంటి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మేల్ హెల్త్ అసిస్టెంట్లు ఎస్. శ్రీరామ్ మూర్తి, శివకుమార్, MLHP కె. ప్రసన్న, ANM కె. బేబీ పద్మకుమారి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గ్రామస్తులకు వర్షాకాలంలో ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం, ప్రతి శుక్రవారం "ఫ్రైడే డ్రైడే" కార్యక్రమాన్ని తప్పనిసరిగా పాటించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, దోమతెరలను వినియోగించడం వంటి నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. అలాగే జ్వరం, తలనొప్పి, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.




