Malikipuram: డెంగ్యూ వ్యాధుల నివారణకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
Malikipuram: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం పడమటపాలెంలో కేశనపల్లి పీహెచ్‌సీ ఆధ్వర్యంలో డెంగ్యూ నివారణ అవగాహన కార్యక్రమం జరిగింది.
Malikipuram: డెంగ్యూ వ్యాధుల నివారణకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
కేశనపల్లి: డా. బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మలికిపురం మండలం, కేశనపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) పరిధిలో డెంగ్యూ మాసోత్సవాల సందర్భంగా శుక్రవారం పడమటపాలెం గ్రామంలో విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్.యూ.ఓ. ఆదినారాయణ గారి ఆదేశాల మేరకు డాక్టర్ సాయిబాబా నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా వైద్య సిబ్బంది గ్రామంలో ర్యాలీ నిర్వహించి, ఇంటింటికీ వెళ్లి సర్వే చేపట్టారు. వర్షాకాలంలో ప్రబలే డెంగ్యూ, మలేరియా, ఫైలేరియా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల బారిన పడకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఇంటి పరిసరాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, ప్రతి శుక్రవారం 'ఫ్రైడే డ్రైడే'ను పాటిస్తూ నీటి నిల్వ పాత్రలను శుభ్రపరచాలని సూచించారు.
అదేవిధంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, దోమతెరలను వినియోగించడం, పూర్తి చేతుల దుస్తులను ధరించడం, జ్వరం వచ్చిన వెంటనే సమీప వైద్య సిబ్బందిని సంప్రదించి తగిన వైద్య పరీక్షలు చేయించుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలందరూ దోమల నివారణ చర్యల్లో భాగస్వాములై తమ కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్‌ఈఓ చంటి, మేల్ హెల్త్ అసిస్టెంట్లు జి. గంగరాజు, కె. శివకుమార్, ఎస్. శ్రీరామ్‌మూర్తి, ఎంఎల్‌హెచ్‌పీ సీహెచ్. పుణ్యవతి, ఏఎన్‌ఎం కె. రత్నకుమారి మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.




