Kesanapalli: అడవిపాలెంలో వైభవంగా డెంగ్యూ మాసోత్సవాల అవగాహన ర్యాలీ
Kesanapalli: అడవిపాలెంలో డెంగ్యూ మాసోత్సవాల సందర్భంగా వైద్య సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు పలు సూచనలు చేశారు.
Kesanapalli: అడవిపాలెంలో వైభవంగా డెంగ్యూ మాసోత్సవాల అవగాహన ర్యాలీ
కేశనపల్లి: డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మలికిపురం మండలం కేశనపల్లి PHC పరిధిలో డెంగ్యూ మాసోత్సవాల కార్యక్రమాలలో భాగంగా SUO ఆదినారాయణ ఆదేశాల మేరకు అడివిపాలెం పరిసర ప్రాంతాలలో డాక్టర్ సాయిబాబా నాయుడు ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో MPHEO శ్రీ చంటి, హెల్త్ అసిస్టెంట్లు శ్రీ ఎస్. శ్రీరామ్ మూర్తి, శ్రీ జి. గంగరాజు, MLHP శ్రీమతి వై. రాజకుమారి, ANM శ్రీమతి బి. ప్రవీణ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
వర్షాకాలంలో ప్రబలే డెంగ్యూ, మలేరియా, ఫైలేరియా వంటి వ్యాధుల నివారణకు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ర్యాలీ అనంతరం ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించి, ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని, ప్రతి శుక్రవారం “డ్రై డే – ఫ్రైడే” కార్యక్రమాన్ని పాటించాలని సూచించారు.
అలాగే పరిసరాల పరిశుభ్రతను కాపాడుకోవడం, దోమతెరలను వినియోగించడం, జ్వరం లేదా ఇతర వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే సమీప వైద్య సిబ్బందికి సమాచారం అందించి తక్షణ వైద్య సేవలు పొందాలని ప్రజలకు వివరించారు. ప్రజల సహకారంతోనే దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను సమర్థవంతంగా నియంత్రించవచ్చని వైద్య సిబ్బంది ఈ సందర్భంగా తెలిపారు.




