Malikipuram: గూడపల్లిలో డెంగ్యూ అవగాహన ర్యాలీ: వైద్య సిబ్బంది పిలుపు!

Malikipuram: మలికిపురం మండలం గూడపల్లిలో డెంగ్యూ మాసోత్సవాల సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ సాయిబాబా నాయుడు ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ, ఇంటింటా సర్వే నిర్వహణ.

PRABHU, RAZOLE
Published on: 20 July 2026 11:39 AM IST
Malikipuram
X

Malikipuram: గూడపల్లిలో డెంగ్యూ అవగాహన ర్యాలీ: వైద్య సిబ్బంది పిలుపు!

Malikipuram: మలికిపురం మండలం కేశనపల్లి పీహెచ్‌సీ పరిధిలోని గూడపల్లిలో డెంగ్యూ మాసోత్సవాల్లో భాగంగా సోమవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు.

ఎస్‌యూఓ ఆదినారాయణ ఆదేశాల మేరకు డాక్టర్ సాయిబాబా నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్‌వో చంటి, హెల్త్ అసిస్టెంట్లు ఎస్‌. శ్రీరామమూర్తి, కె. శివకుమార్, జి. గంగరాజు, ఎంఎల్‌హెచ్‌పీ ఎం. రాజప్రియ, ఏఎన్‌ఎం కె. నాగ ప్రమీల, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, ఫైలేరియా వంటి వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు. ఇంటింటా సర్వే నిర్వహించి నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని సూచించారు. ప్రతి శుక్రవారం డ్రై డే పాటిస్తూ నీటి నిల్వ పాత్రలను శుభ్రం చేయాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమతెరలను వినియోగించాలని తెలిపారు. జ్వరం వచ్చిన వెంటనే వైద్య సిబ్బందిని సంప్రదించి చికిత్స పొందాలని సూచించారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story