Razole: త్స్యకారులకు వరం 43 బోట్లకు పర్మిషన్ పత్రాలు ఇచ్చిన ఎమ్మెల్యే
Razole: 141 మంది లబ్ధిదారులకు రూ.71.35 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు, 43 మత్స్యకార బోట్ల పర్మిషన్ పత్రాలను ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పంపిణీ చేశారు.
Razole: త్స్యకారులకు వరం 43 బోట్లకు పర్మిషన్ పత్రాలు ఇచ్చిన ఎమ్మెల్యే
రాజోలు: డాక్టర్.బీఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గంలోని మలికిపురం మండలం లక్కవరం ఎం.జి. గార్డెన్స్ మినీ ఫంక్షన్ హాల్లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా 141 మంది లబ్ధిదారులకు రూ.71,35,287 విలువైన చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ద్వారా పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు. గత రెండేళ్ల కాలంలో రాజోలు నియోజకవర్గంలో 1,229 మంది లబ్ధిదారులకు సుమారు రూ.9 కోట్ల మేర ఆర్థిక సహాయం అందించామని వెల్లడించారు.
ఆర్థిక ఇబ్బందులు, తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తోందని పేర్కొన్నారు.
దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారికి అవసరాన్ని బట్టి ఎల్వోసీ (L.O.C.)లను కూడా ముందస్తుగా మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కూటమి నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు అర్హులను గుర్తించి చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. కష్టకాలంలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచి ఆర్థిక భరోసా కల్పిస్తోందని పేర్కొన్నారు.
అనంతరం మత్స్యకారులకు చెందిన 43 బోట్లకు పర్మిషన్ పత్రాలను ఎమ్మెల్యే అందజేశారు. మత్స్యకారుల సంక్షేమం, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు. అంతర్వేది మినీ ఫిషింగ్ హార్బర్‌ను మరింత అభివృద్ధి చేసే దిశగా చర్యలు చేపడుతున్నామని, అలాగే కరవాకలో కూడా త్వరలోనే మరో మినీ ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, అధికారులు, మత్స్యకారులు మరియు లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




