Kadiyam: కడియంలో శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారంలో అమ్మవారు!
Kadiyam: కడియం బొబ్బిలి బ్రిడ్జి సెంటర్లోని శ్రీదేవి అమ్మవారి ఆలయంలో లలితా త్రిపుర సుందరీ దేవి అవతారంలో దర్శనం. భక్తిశ్రద్ధలతో శరన్నవరాత్రి ఉత్సవాలు, విశేష పూజలు.
Kadiyam: కడియంలో శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారంలో అమ్మవారు!
Kadiyam: మండల కేంద్రమైన కడియం బొబ్బిలి బ్రిడ్జి సెంటర్ వద్ద వెలసిన శ్రీదేవి అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కోలాహలంగా జరుగుతున్నాయి. బుధవారం రాత్రి సత్య శ్రావణి నృత్య నికేతన్ రాజమండ్రి వారిచే నిర్వహించబడిన కూచిపూడి నృత్యం ఆధ్యంతం ఆకట్టుకుంది. ఉత్సవాలలో ఐదవ రోజైన గురువారం అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి రూపంలో దర్శనమిచ్చారు.
అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిని దర్శించుకునేందుకు కడియం పరిసర గ్రామ భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణం అమ్మవారి నామస్మరణతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
శరన్నవరాత్రి ఉత్సవాల్లో ప్రతిరోజూ అమ్మవారికి వివిధ అలంకారాలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపాకటాక్షాలు పొందుతున్నారు. భక్తులకు ఏ విధమైన అసౌకర్యము కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.




