Rajahmundry: ధవళేశ్వరంలో రూ.45 లక్షలతో రైతు బజార్ ప్రారంభం!
Rajahmundry: ధవళేశ్వరంలో రూ.45 లక్షలతో నిర్మించిన రైతు బజార్ను ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రారంభించారు త్వరలో కడియం ఆదర్శ నగర్లోనూ ఏర్పాటు చేయనున్నారు.
Rajahmundry: ధవళేశ్వరంలో రూ.45 లక్షలతో రైతు బజార్ ప్రారంభం!
Rajahmundry: రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంతో పాటు, వినియోగదారులకు తక్కువ ధరకే నాణ్యమైన కూరగాయలు అందించడమే రైతు బజార్ల ప్రధాన లక్ష్యమని రాజమహేంద్రవరం గ్రామీణ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు.
రాజమహేంద్రవరం మహానగర పరిధిలోని ధవళేశ్వరంలో సుమారు రూ.45 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన నూతన రైతు బజార్ను సోమవారం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు తమ పంటలను నేరుగా వినియోగదారులకు విక్రయించే అవకాశం కల్పించడం ద్వారా మధ్యవర్తుల ప్రమేయం తగ్గి రైతులకు తగిన ధర లభిస్తుందని, ప్రజలకు తాజా కూరగాయలు అందుబాటు ధరల్లో లభిస్తాయని పేర్కొన్నారు.
కడియం, ఆదర్శ నగర్ లోనూ రైతు బజార్లు
ధవళేశ్వరం పరిసర ప్రాంతాల్లో సుమారు 50 వేల జనాభా ఉన్నందున ఈ రైతు బజార్ స్థానికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రాంతీయ అవసరాలను దృష్టిలో ఉంచుకొని త్వరలో కడియం, ఆదర్శ నగర్ లోనూ రైతు బజార్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
తాగునీటి సదుపాయాలకు రూ.80 లక్షలు
ధవళేశ్వరం కొండపై ఉన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకునేందుకు రూ.80 లక్షలు కేటాయించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. బొమ్మూరు కాంప్లెక్స్ నుంచి ధవళేశ్వరం వరకు తాగునీరు అందించే కార్యక్రమాన్ని త్వరలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్, రూరల్ మండల తెదేపా అధ్యక్షులు మత్శేటి ప్రసాద్, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, రాష్ట్ర కుమ్మరి శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్లు పండురి అప్పారావు, దాలిపర్తి వేమన, ఏఎంసీ వైస్ చైర్మన్ బోడపాటి గోపి, మార్కెటింగ్ శాఖకు చెందిన ఎం. సునీల్ కుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి శ్రీమతి బి. భారతి, పిన్నమ్మ రెడ్డి ఈశ్వరుడు, గాలి సుబ్బరాజు, తలారి మూర్తి, పుక్కళ్ల రాజు, ఎడ్ల మహేష్, ఒంటెద్దు స్వామి, పొన్నాల లక్ష్మీ సంతోషి, బొప్పన నాగేశ్వరరావు, షేక్ అమీనా బేగం, గుర్రాల వెంకట్రావు, మండ బిందు, ఆళ్ల ఆనందరావు, బీర ప్రకాష్, అంబటి శ్రీను, వర్రె రాజేష్, కొడమంచిలి సూర్య, బజార్ల ఎస్టేట్ అధికారులు ఎన్. మణికంఠ నాయుడు, ఎస్. రోజియా, చి. సతీష్ కుమార్, చి. రామకృష్ణ, ఐటీవీ అప్పాజీరావు, ఈ. భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.




