Rajahmundry: మ్మార్పీఎస్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి వేడుకలు
Rajahmundry: రాజమండ్రిలో ఏపీ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 40వ వర్ధంతి వేడుకలు జరిగాయి.
Rajahmundry: మ్మార్పీఎస్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి వేడుకలు
రాజమండ్రి: మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ కు భారతరత్న అవార్డును ప్రకటించాలని దళిత సంఘాల నాయకులు కోరారు.
సోమవారం రాజమండ్రి చర్చి పేట సెంటర్లో ఉన్న బాబు జగజీవన్ రామ్ విగ్రహం వద్ద ఏపీ ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి దొండపాటి కృష్ణ ఫర్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ 40వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల చైర్ పర్సన్ డాక్టర్ ఖండవల్లి లక్ష్మి, జనసేన నాయకులు బోయినపల్లి సుందరయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ ఖండవల్లి లక్ష్మీ మాట్లాడుతూ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ దేశానికి అనేక సేవలు అందించారని అన్నారు. రక్షణ మంత్రిగా కార్మిక శాఖ మంత్రిగా రైల్వే శాఖ మంత్రిగా దేశానికి ఎనలేని సేవలు అందించాలని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
జనసేన నాయకులు బోయినపల్లి సుందరయ్య మాట్లాడుతూ మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ సమ సమాజ స్థాపన కోసం కృషి చేశారని అన్నారు. దళితులకు ఆస్తులు లేవని చదివే మా ఆస్తి అని వివరించారు. మందకృష్ణ మాదిగ మాకు ఆత్మగౌరవం బ్రతకడం నేర్పించాలని ఆయన బాటలో పయనిస్తామని అన్నారు.
ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు కోరుకొండ చిరంజీవి మాట్లాడుతూ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భారతదేశంలో ఆహార కొరత లేకుండా ఈ ఎఫ్ సి ఐ అనే సంస్థను స్థాపించి భారతదేశంలో ఆకలి చావులు లేకుండా చేశారని అన్నారు. అలాగే రక్షణ శాఖ, కార్మిక శాఖ ,రైల్వే శాఖల మంత్రిగా భారతదేశానికి సేవలు అందించారని 50 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న ఏకైక వ్యక్తిగా వరల్డ్ రికార్డు సృష్టించారని పేర్కొన్నారు.
ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి దొండపాటి కృష్ణ ఫర్ మాట్లాడుతూ దళితుల ముద్దుబిడ్డ డాక్టర్ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ లేని నాయకుడని కొనియాడారు. కేంద్రంలో అనేక మంత్రి పదవులు నిర్వహించి బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేశారని తెలిపారు. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు ఇవ్వాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఉత్తరపుడి రమణ, అనపర్తి సురేంద్ర, వెండ్రపాటి సురేష్, ఉడమల నాగేశ్వరరావు, పలివెల రాజు, దొండపాటి రాజబాబు, బొలిపే సుధాకర్, బొడ్డపాటి సూరిబాబు, అనపర్తి రాజేష్, ఈతలపాటి రవి తదితరులు పాల్గొన్నారు.




