Amalapuram: భారీ యాంటీ డ్రగ్స్ ర్యాలీ.. ప్రతిజ్ఞ చేసిన ఎస్పీ, విద్యార్థులు!
Amalapuram: అమలాపురంలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆధ్వర్యంలో 1,500 మందితో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు.
Amalapuram: భారీ యాంటీ డ్రగ్స్ ర్యాలీ.. ప్రతిజ్ఞ చేసిన ఎస్పీ, విద్యార్థులు!
అమలాపురం: ఇంటర్నేషనల్ డై ఎగైనెస్ట్ డ్రగ్ అబ్యూస్ 2026 సందర్భంగా ఈ రోజు జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ మీనా,ఐపిఎస్ గారి నాయకత్వంలో అమలాపురం గోకుల్ సెంటర్ నుండి గడియార స్తంభం వరకు భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు.ర్యాలీ అనంతరం గడియార స్తంభం వద్ద ఏర్పాటు చేసిన సభలో విద్యార్థులు మరియు ప్రజలకు డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలు,వాటి నివారణ, డ్రగ్స్‌కు దూరంగా ఉండాల్సిన అవసరంపై అవగాహన కల్పించారు.
ఎస్పీ ఐ పి ఎస్ రాహుల్ మీనా మాట్లాడుతూ.ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు డ్రగ్స్ దుర్వినియోగం గురించి మరియు గంజాయి వంటి మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్పరిణామాలు,శారీరక మరియు మానసిక ఆరోగ్యంపై వచ్చే ప్రభావం,నేరచరిత్రపై పడే ప్రభావాలు వంటి అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు.NDPS చట్టం కింద కేసులలో ఇరుక్కుంటే ఎదురయ్యే పరిణామాలు మరియు శిక్షల గురించి స్పష్టంగా తెలియజేయడమైనది.డ్రగ్స్‌కు "NO" చెప్పి ఆరోగ్యకరమైన, బాధ్యతాయుతమైన జీవితాన్ని గడపాలని పిలుపునిచ్చారు.
మత్తు పదార్థాల వల్ల కుటుంబం మరియు సమాజంపై కలిగే ప్రతికూల ప్రభావం వివరించడమైనది.డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి విద్యార్థి, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు ప్రజలు భాగస్వాములు కావాలని సూచించారు.గంజాయి సంబంధిత కదలికలపై ఎటువంటి సమాచారమున్నా వారిని 1972 టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారమివ్వమని, వారి వివరములను గోప్యంగా ఉంచబడినవి తెలపడమైనది.
అందరి చేత ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు మరియు సిబ్బంది.అదనపు ఎస్పీ డీఎస్పీ అమలాపురం మహిళ పి.యస్. డీఎస్పీ ఏఆర్ డీఎస్పీ సీఐలు,ఆర్‌ఐలు,ఎస్‌ఐలు ఏరియా హాస్పిటల్ సైకియాట్రిస్ట్ డాక్టర్ సౌమ్య మరియు వైద్య సిబ్బంది.ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులు డీ-అడిక్షన్ సెంటర్ సిబ్బంది.
పోలీసు సిబ్బంది మరియు ఏఆర్ సిబ్బంది.ఈ కార్యక్రమంలో ఈ అవగాహన కార్యక్రమంలో మొత్తం సుమారు 1,500 మంది పాల్గొని డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి తమ సంఘీభావం తెలిపారు.




