Rajahmundry: రాజమండ్రి వైద్యుడికి అంతర్జాతీయ గౌరవం!

Rajahmundry: రాజమహేంద్రవరం కిమ్స్ బొల్లినేని హాస్పిటల్‌కు చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎన్.ఎస్. రామరాజు పరిశోధన వ్యాసం.

Padala Chiranjeevi Reddy, Staff Reporter -East Godavari
Published on: 15 Jun 2026 11:02 AM IST
Rajahmundry
X

Rajahmundry: రాజమండ్రి వైద్యుడికి అంతర్జాతీయ గౌరవం!

రాజముండ్రి: రాజమహేంద్రవరంలోని KIMS బొల్లినేని హాస్పిటల్‌కు చెందిన ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ N S రామరాజు గారు అంతర్జాతీయ స్థాయిలో మరో విశిష్ట గుర్తింపు పొందారు. ప్రపంచ ప్రఖ్యాత అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ (ACC) యొక్క ప్రతిష్ఠాత్మక జర్నల్ JACC Case Reports లో ఆయన పరిశోధన వ్యాసం జూన్ 3, 2026న ప్రచురితమైంది.

"Real-Time IVUS-Guided Precision Stenting of the Ostial Left Anterior Descending Artery" అనే శీర్షికతో ప్రచురితమైన ఈ వ్యాసాన్ని డా. రామరాజు, డా. హితేష్ శ్రీనివాస కృష్ణ రెలంగి సంయుక్తంగా రచించారు.

ఈ పరిశోధనలో గుండెకు అత్యంత కీలకమైన LAD ధమనిలో బ్లాకేజీ చికిత్స కోసం IVUS (Intravascular Ultrasound) ఆధారిత అత్యాధునిక స్టెంటింగ్ పద్ధతిని విజయవంతంగా ప్రదర్శించారు. ఈ సాంకేతికత ద్వారా స్టెంట్‌ను అత్యంత ఖచ్చితత్వంతో అమర్చడం సాధ్యమై, భవిష్యత్తులో సమస్యలు తలెత్తే అవకాశాలను తగ్గించవచ్చని అధ్యయనం సూచిస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా కార్డియాలజిస్టులకు మార్గదర్శకంగా నిలిచే ఈ పరిశోధన ప్రచురణ రాజమహేంద్రవరం, ఆంధ్రప్రదేశ్ వైద్య రంగాలకు గర్వకారణమైంది. ఈ సందర్భంగా KIMS బొల్లినేని హాస్పిటల్ ED స్వర్ణ రామ్ మోహన్, వైద్యులు మరియు నగర ప్రజలు డా. రామరాజును అభినందించారు.

Padala Chiranjeevi Reddy, Staff Reporter -East Godavari

Padala Chiranjeevi Reddy, Staff Reporter -East Godavari

తూర్పు గోదావరి జిల్లాలో 13 సంవత్సరాల నమ్మకమైన జర్నలిజం ప్రయాణం. నిఖార్సైన వార్తలు, లోతైన విశ్లేషణలతో సాగుతున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.

Next Story