Rampachodavaram: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం: డీఆర్ఓ!
Rampachodavaram: ఐటీడీఏ సమావేశ మందిరంలో వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో జిల్లా రెవెన్యూ అధికారి పి. అంబేద్కర్ జేఏసీ సమీక్షా సమావేశం నిర్వహించారు.
Rampachodavaram: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం: డీఆర్ఓ!
రంపచోడవరం: పోలవరం జిల్లా వివిధ శాఖలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించే విధంగా తగు చర్యలు చేపట్టిన జరుగుతుందని పోలవరం జిల్లా రెవిన్యూ అధికారి పి.అంబేద్కర్ పేర్కొన్నారు. గురువారం సాయంకాలం స్థానిక ఐటీడీఏ సమావేశ హాలులో వివిధ శాఖలకు సంబంధించిన సంఘ నాయకులతో వివిధ సమస్యలు పరిష్కరించే విధంగా జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ)పి. అంబేద్కర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవిన్యూ అధికారి పి. అంబేద్కర్ మాట్లాడుతూ పోలవరం జిల్లా కలెక్టర్ కె.దినేష్ కుమార్ వారి ఆదేశాల మేరకు ఆల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులతో జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) సమావేశం నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు.
వివిధ శాఖలకు సంబంధించిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తమ శాఖలకు సంబంధించిన పలు సమస్యలు, ఉద్యోగుల సంక్షేమం, సేవా సంబంధిత అంశాలు, పెండింగ్‌లో ఉన్న సమస్యలు మరియు ఇతర పరిపాలనా అంశాలను డీఆర్ఓ దృష్టికి తీసుకువచ్చారు.
ఉద్యోగులు ప్రభుత్వ పరిపాలనలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన ప్రతి వినతిని సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని పరిశీలించి, ప్రభుత్వనికి నివేదికలు పంపించడం జరుగుతుందని ఆయన అన్నారు .పోలవరం
జిల్లా అభివృద్ధికి ఉద్యోగుల సహకారం ఎంతో అవసరమని ఆయన అన్నారు.
ఈ సమావేశంలో డిప్యూటీ తాసిల్దార్ లు, సరిత, వెంకట్, ఆల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు షేక్ జిలాని, ఎల్ వెంకటేశ్వరరావు,కత్తుల ఆది రెడ్డి, కడబాల రాంబాబు, పి వెంకటేశ్వరరావు,బి కృష్ణ, విండెల కృష్ణారావు,సుందర్ రావు,వివిధ ఉద్యోగ సంఘా నాయకులు, తదితరులు పాల్గొన్నారు.




