Gokavaram: గోకవరంలో దుర్గమ్మ సన్నిధిలో భారీ అన్నసమారాధన!

Gokavaram: తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో దసరా ఉత్సవాల ముగింపు వేళ కనకదుర్గమ్మ సన్నిధిలో భారీ అన్నసమారాధన నిర్వహించారు.

NARAYANA, RAJANAGARAM
Published on: 23 Oct 2026 8:15 PM IST
Gokavaram
X

Gokavaram: గోకవరంలో దుర్గమ్మ సన్నిధిలో భారీ అన్నసమారాధన!

గోకవరం: తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండల కేంద్రంలో దసరా ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన శ్రీ కనకదుర్గమ్మవారి అన్న సమారాధనకు భారీ గా భక్తజనం పోటెత్తారు. గోకవరం ఆంజనేయస్వామి ఆలయ గద్దె వద్ద కొలువుదీరిన కనకదుర్గమ్మవారి సన్నిధిలో నిర్వహించిన ఈ అన్న సమారాధన ఘనంగా నిర్వహించారు.

ఈ అన్న సమారాధన లో సుమారు 5 వేల మంది భక్తులు పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగిన ఈ కార్యక్రమానికి గోకవరం మండలంతో పాటు పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

ఆర్యవైశ్య సంఘం సభ్యులు, గద్దె కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అన్న సమారాధనలో భక్తులకు వివిధ రకాల వంటకాలతో అన్నప్రసాదాన్ని అందించారు. భక్తులు క్రమశిక్షణతో అన్నప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు.

దసరా ఉత్సవాల ముగింపు సందర్భంగా అమ్మవారి సన్నిధిలో నిర్వహించిన ఈ అన్న సమారాధన గోకవరం ప్రాంతంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనడంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి.

ఆర్యవైశ్య సంఘం సభ్యులు, గద్దె కమిటీ సభ్యులు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు, గద్దె కమిటీ సభ్యులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

NARAYANA, RAJANAGARAM

NARAYANA, RAJANAGARAM