Rajanagaram: రంపఎర్రంపాలెం ఎంపీటీసీ-1 బరిలో బత్తిన రామకృష్ణ!

Rajanagaram: తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం రంపఎర్రంపాలెం ఎంపీటీసీ-1 స్థానానికి వైసీపీ టికెట్ దక్కకపోవడంతో బత్తిన రామకృష్ణ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.

NARAYANA, RAJANAGARAM
Published on: 23 Oct 2026 8:25 PM IST
Rajanagaram
X

Rajanagaram: రంపఎర్రంపాలెం ఎంపీటీసీ-1 బరిలో బత్తిన రామకృష్ణ!

గోకవరం: రంప ఎర్రం పాలెం ఎంపిటిసి 1 రిజర్వ్ స్థానంలో బత్తిన రామకృష్ణ తన నామినేషన్ ఈరోజు దాఖలు చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బత్తిన రామకృష్ణ పార్టీ టికెట్ దక్కాక పోవడంతో తనకు పూర్తిగా పట్టు ఉన్న స్థానాన్ని వదులుకోలేక స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగాడు. తన తండ్రి బత్తిన వీరాస్వామి కి వారసత్వంగా బరిలో నిలవనున్నట్లు తెలిపారు.

ఇదిలా ఉండగా 2006లో తన తండ్రి బత్తిన వీరాస్వామి కాంగ్రెస్ పార్టీలో నిలిచి విజయం సాధింసారు. అదే స్థానాన్ని అదే సామాజిక వర్గానికి కేటాయించడంతో తన వారసత్వంగా తనకు కావాలని వైస్సార్సీపీలో ఆశించిన టికెట్ రాకపోవడంతో తనకున్న పరిచయాలను తన ఓట్ బ్యాంకును వదులుకోలేక స్వతంత్ర అభ్యర్థిగా బ్యారిలోకి దిగుతూ ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు.

స్వతహాగా మీడియాలో 24 సంవత్సరాలుగా పనిచేస్తూ ఒక స్వచ్ఛంద సేవా సంస్థగా 15 సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తున్న బత్తిన రామకృష్ణ ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలవడంతో అనూహ్యంగా తనకు మద్దతు పెరిగింది.

గ్రామంలోని తన తండ్రి బత్తిని వీరాస్వామి ద్వారా ఉన్న పరిచయాలు అక్కడ స్థానిక ప్రజలు పడుతున్న ఇబ్బందులపై అవగాహన వాటికి పరిష్కారం మార్గాలు అన్ని తనకు అనుకూలంగా ఉండడంతో గ్రామ ప్రజలు తన కుటుంబాన్ని ఆశీర్వదిస్తారని ఆ విధంగా అడుగులు ముందుకు వేస్తున్నట్లు సమాచారం.

NARAYANA, RAJANAGARAM

NARAYANA, RAJANAGARAM