Kadiam: కడియం ఎంపీపీ, వైస్ ఎంపీపీ పీఠాలు మహిళలకే ఏకగ్రీవం!

Kadiam: తూర్పుగోదావరి జిల్లా కడియం మండల పరిషత్ ఏడవ పాలకవర్గం కొలువుతీరింది. ఎంపీపీగా బోడపాటి మోహిని వీర పుణ్యవతి, వైస్ ఎంపీపీగా నాగిరెడ్డి మణికుమారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

S POSAYYA, RAJUMUNDRY RURAL
Published on: 19 Nov 2026 5:46 PM IST
Kadiam
X

Kadiam: కడియం ఎంపీపీ, వైస్ ఎంపీపీ పీఠాలు మహిళలకే ఏకగ్రీవం!

కడియం: తూర్పుగోదావరి జిల్లా కడియం మండల పరిషత్ ఏడవ నూతన పాలకవర్గం కొలువుతీరింది. మహిళలే మహారాణులుగా ఎంపీపీ పీఠానికి బోడపాటి మోహిని వీర పుణ్యవతి వైస్ ఎంపీపీగా నాగిరెడ్డి మణికుమారి ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. 22 మంది ఎంపీటీసీ సభ్యులు తొలిత ప్రమాణ స్వీకారం చేశారు 20 మంది కూటమి అభ్యర్థులు ఇద్దరు వైసీపీ అభ్యర్థులు ఎంపిటిసిలుగా విజయం సాధించిన విషయం తెలిసిందే.

వారంతా గురువారం అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం జరిగిన ఎంపికలో ఎంపీపీగా బోడపాటి పుణ్యవతి కూటమి అభ్యర్థులు బలపరచగా ఏకగ్రీవంగా ఆమోదించారు. అలానే వైస్ ఎంపీపీ నాగిరెడ్డి మణికుమార్ ని కూడా ఏకగ్రీవంగా ఆమోదించారు. వీరికి పోటీ లేకపోవడంతో ఎంపీపీగా బోడపాటిని వైస్ ఎంపీపీ గా నాగిరెడ్డిని ఎన్నికల అధికారి మల్లికార్జునరావు అధికారికంగా ప్రకటించారు.

నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపిన కూటమి నాయకులు..

కడియం మండల పరిషత్ కార్యాలయంలో నూతనంగా కొలువుతీరిన ఏడవ పాలకవర్గాన్ని పలువురు కూటమి నాయకులు అభినందించారు. కడియం మండల పరిషత్ కి ప్రత్యేక స్థానం ఉందని. ఆ ప్రాధాన్యతను కాపాడుతూ అభివృద్ధి దిశగా మండలాన్ని నడిపించాలని సీనియర్ టిడిపి నాయకులు అన్నందేవుల చంటి కోరారు. ఎంపీపీ బోడపాటి పుణ్యవతి, ఆమె భర్త బోడపాటి గోపికి, ఎంపీపీ నాగిరెడ్డి మణికుమారీ లకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

S POSAYYA, RAJUMUNDRY RURAL

S POSAYYA, RAJUMUNDRY RURAL