Rajahmundry: తూర్పుగోదావరిలో రేపటి నుండి సత్యసాయి తాగునీటి సిబ్బంది సమ్మె

Rajahmundry: తూర్పుగోదావరి జిల్లాలో శ్రీ సత్యసాయి తాగునీటి పథకం సిబ్బంది 7 నెలలుగా జీతాలు, పీఎఫ్, ఈఎస్‌ఐ లేక సోమవారం నుండి సమ్మె బాట పడుతున్నారు.

NARAYANA, RAJANAGARAM
Published on: 14 Jun 2026 9:16 PM IST
Rajahmundry
X

Rajahmundry: తూర్పుగోదావరిలో రేపటి నుండి సత్యసాయి తాగునీటి సిబ్బంది సమ్మె

Rajahmundry: తూర్పుగోదావరి జిల్లాలో శ్రీ సత్య సాయి త్రాగునీటి సిబ్బంది ఏడు నెలల జీతాలు పిఎఫ్ ఈయస్ఐ లేక ఇబ్బంది గురవుతున్న కారణంగా అలాగే ప్రాజెక్టు నీ జిల్లా పరిషత్ ద్వారా నిర్వహణ మెయింటినెన్స్ కలిపి చేయడం వల్ల సమ్మె చేస్తేనే కానీ జీతాలు వచ్చే పరిస్థితి కనబడటం లేదు పాత కాంట్రాక్టర్ జీతం ఇవ్వకుండా వదిలి వెళ్ళినారు అడిగితే నాకు సంబంధం లేదని చెప్తున్నారు.

ఇటీవల వచ్చిన కొత్త కాంట్రాక్టర్ మెయింటెనెన్స్ కి డబ్బులు పేట్టకపోవడం వల్ల ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు పరిస్థితిలో మార్పు రాలేదు దానివల్ల ప్రజలకు త్రాగునీరు అందించలేకపోతున్నామని బాధ ఒకవైపు కష్టపడి పనిచేస్తున్న జీతాలలు ఇవ్వడం లేదని మరొకవైపు రోజురోజుకు పెరుగుతున్న నిత్యవసర వస్తువులు ధరలను తట్టుకోలేక అప్పులు తెచ్చుకునీ ఇప్పటివరకు గడుపుకుంటూ రావడం జరిగింది.

ఇక అప్పు పుట్టే పరిస్థితి కూడా లేకపోవడం వలన దిక్కు తోచని పరిస్థితిలో ప్రభుత్వం వెంటనే నిధులు కేటాయించి ప్రాజెక్టుని పు ఆపరేషన్ మెయింటినెన్స్ సపరేట్ చేసి జీతాలు నెల నెల వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని గత 20 రోజుల ముందే అధికారులకే కాంట్రాక్టర్ కి లెటర్ ఇచ్చిన స్పందన కరువు అవడం సమ్మె కి వెళ్లడం జరుగుతుందని,

ప్రజలు ఈ సమ్మెకు మద్దతుగా నిలబడాలని ప్రభుత్వం సత్యసాయి బాబా ఆశయాన్ని బతికించాలని వేడుకుంటూ సోమవారం నుంచి ప్రత్యక్ష పోరాటంలోకి వెళ్లడం జరుగుతుందని ప్రజా ప్రతినిధులకు అధికారులకు ప్రజలకు మీడియా ద్వారా సిబ్బంది యూనియన్ ప్రెసిడెంట్ పాటి శేషారావు, కట్టమూరు వీరబాబు, మహంతి వెంకటే, యు గణపతి, లక్ష్మీనారాయణ, రామకృష్ణ తెలియపరచడం జరుగుతుంది.

NARAYANA, RAJANAGARAM

NARAYANA, RAJANAGARAM

Next Story