Konaseema: ఆర్టీసీ బస్సు ఎక్కుతూ జారిపడి వృద్ధుడు మృతి!
Konaseema: యర్రపోతవరం వంతెన వద్ద ఆర్టీసీ బస్సు ఎక్కుతుండగా జారిపడి చక్రం కింద పడి అద్దంపల్లి వాసి వాసా సత్యనారాయణ (70) మృతి చెందారు.
Konaseema: ఆర్టీసీ బస్సు ఎక్కుతూ జారిపడి వృద్ధుడు మృతి!
Konaseema: కె.గంగవరం మండలం యర్రపోతవరం వంతెన వద్ద ఆర్టీసీ బస్ ఎక్కుతూ జారి పడి వ్యక్తి మృతి.
మృతి చెందిన వ్యక్తి అద్దంపల్లి గ్రామానికి చెందిన వాసా సత్యనారాయణ (70) గా గుర్తించిన పోలీసులు.
అద్దంపల్లి గ్రామం నుంచి మృతుడు వాసా సత్యనారాయణ రాజమండ్రి లో ఉన్న తన చిన్న కొడుకు వద్దకు వెళ్లేందుకు రామచంద్రపురం వైపు వెళుతున్న ఆర్ టి సి బస్సు ఎక్కుతుండగా యర్ర పోతవరం వంతెన వద్ద చోటు చేసుకున్న ఘటన.
ఆర్టీసీ బస్సు వెనకాల చక్రం ఎక్కటం తో అక్కడకక్కడే మృతిచెందిన వాసా సత్యనారాయణ. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పామర్రు పోలీసులు.




