Rampachodavaram: భారీ వర్షాల నేపథ్యంలో ఎన్నికల కేంద్రాల్లో మార్పులు: సబ్ కలెక్టర్
Rampachodavaram: భారీ వర్షాల దృష్ట్యా రంపచోడవరం డివిజన్ పరిధిలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పంపిణీ, రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాలను సవరిస్తూ సబ్ కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు.
Rampachodavaram: భారీ వర్షాల నేపథ్యంలో ఎన్నికల కేంద్రాల్లో మార్పులు: సబ్ కలెక్టర్
Rampachodavaram: అధిక వర్షాల నేపథ్యంలో ఎన్నికల విధుల నిర్వహణలో సిబ్బందికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ ఆదేశాల మేరకు రంపచోడవరం డివిజన్ పరిధిలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి పంపిణీ కేంద్రాలు, రిసెప్షన్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ హాళ్లను సవరించినట్లు రంపచోడవరం సబ్ కలెక్టర్ డి. పృథ్వీరాజ్ కుమార్ మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు.
రంపచోడవరం మండలానికి మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని పంపిణీ కేంద్రంగా, ప్రభుత్వ డిగ్రీ కళాశాలను రిసెప్షన్ కేంద్రంగా;
దేవీపట్నం మండలానికి ఇందుకూరుపేట జెడ్పీ ఉన్నత పాఠశాలను పంపిణీ కేంద్రంగా;
మారేడుమిల్లి, అడ్డతీగల మండలాలకు ఆయా మండలాల్లోని జెడ్పీ ఉన్నత పాఠశాలలను పంపిణీ కేంద్రాలుగా ఏర్పాటు చేశారు.
రాజవొమ్మంగి మండలానికి ఆశ్రమ పాఠశాల (బాలురు), వై. రామవరం మండలానికి మండల ప్రజా పరిషత్ కార్యాలయం, గుర్తేడు మండలానికి మారేడుమిల్లిలోని యూత్ ట్రైనింగ్ సెంటర్ (YTC), గంగవరం మండలానికి మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని పంపిణీ కేంద్రాలుగా ఖరారు చేశారు.
దేవీపట్నం, మారేడుమిల్లి, అడ్డతీగల మండలాలకు రిసెప్షన్ కేంద్రంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రంపచోడవరం ఏర్పాటు చేయగా, రాజవొమ్మంగి, వై. రామవరం, గుర్తేడు, గంగవరం మండలాలకు ఏపీటీడబ్ల్యూఆర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల (బాలికలు), రంపచోడవరాన్ని రిసెప్షన్ కేంద్రంగా నిర్ణయించారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాల కొత్త డిగ్రీ కళాశాల ఉత్తర భవనంలో దేవీపట్నం మండలానికి గ్రౌండ్ ఫ్లోర్ గది నంబర్ 28ను స్ట్రాంగ్ రూమ్‌గా, గది నంబర్ 27ను కౌంటింగ్ హాల్‌గా; మారేడుమిల్లి మండలానికి పడమటి వైపు గది నంబర్ 30ను స్ట్రాంగ్ రూమ్‌గా, మొదటి అంతస్తు పడమటి వైపు గది నంబర్ 31ను కౌంటింగ్ హాల్‌గా కేటాయించారు.
ఏపీటీడబ్ల్యూఆర్ బాలికల కళాశాల ఉత్తర భవనంలో రాజవొమ్మంగి మండలానికి దక్షిణం వైపు మధ్య గది నంబర్ 8, ఉత్తరం వైపు మధ్య గదులు 5, 6; వై. రామవరం మండలానికి మొదటి అంతస్తు ఉత్తరం వైపు గది నంబర్ 9, దక్షిణం వైపు గది నంబర్ 10; గుర్తేడు మండలానికి మొదటి అంతస్తు ఉత్తరం వైపు గది నంబర్ 16, దక్షిణం వైపు గది నంబర్ 15; గంగవరం మండలానికి రెండో అంతస్తులో గది నంబర్ 19, అలాగే గదులు 18, 20 కేటాయించినట్లు సబ్ కలెక్టర్ తెలిపారు. ఎన్నికల సిబ్బంది సవరించిన కేంద్రాలు, గదుల వివరాలను గమనించి విధులు నిర్వహించాలని సూచించారు.




