Rajahmundry: తప్పులు లేని ఓటరు జాబితాయే లక్ష్యం..
Rajahmundry: రాజమహేంద్రవరం అర్బన్ పరిధిలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను వేగవంతం చేయాలని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి,
Rajahmundry: తప్పులు లేని ఓటరు జాబితాయే లక్ష్యం..
రాజముండ్రి: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)లో భాగంగా రాజమహేంద్రవరం అర్బన్ లో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి, కమిషనర్ రాహుల్ మీనా ఆదేశించారు.
నగరపాలక సంస్థ కార్యాలయంలోని మీటింగ్ హాల్ నందు అర్బన్ పరిధిలోని 12 మంది అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులతో(ఏఈఆర్ఓ) శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రతి ఏఈఆర్ఓ పరిధిలో ఇద్దరు సూపర్ వైజర్లు, 20 మంది బీఎల్ఓలు ఉంటారని.. వారంతా సమర్థవంతంగా పనిచేస్తున్నదీ నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు.
పోలింగ్ స్టేషన్ల వారీగా బూత్ లెవల్ అధికారులు(బీఎల్ఓ) ప్రతిరోజు ఎన్ని ఇళ్లు సందర్శిస్తున్నది., పూరించిన ఎన్యూమరేషన్ ఫారాలను ఎన్ని సేకరిస్తున్నది..? ప్రతిరోజు సమీక్షించాలన్నారు. అలాగే సాయంత్రనికల్లా ప్రతి ఒక్క బీఎల్ఓ కనీసం 75 శాతం ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేసేలా ఏఈఆర్ఓలు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే సేకరించిన ఫారాల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో డిజిటలైజ్ చేయవలసిందిగా ఆదేశించారు.
2002 ఓటర్ లిస్టును ప్రామాణికంగా తీసుకొని ప్రస్తుతం ఎలాంటి తప్పులు లేని సమగ్ర ఓటరు జాబితాను పకడ్బందీగా రూపొందించాలని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
నిజమైన ఏ ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా ధ్రువీకరణ చేపట్టాలన్నారు. నిర్దేశిత గడువులోగా ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి చేయని వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
అదేవిధంగా బూత్ లెవర్ అధికారులు ఇంటింటికి వచ్చినప్పుడు ఓటర్లు పూర్తి వివరాలతో ఎన్యూమరేషన్ ఫారాన్ని సమర్పించి.. తప్పులు లేని ఓటరు జాబితా తయారుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఓటర్లకు ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే బూత్ లెవల్ అధికారులను సంప్రదించవచ్చని.. లేదా కంట్రోల్ రూమ్ నెంబర్ 9494060060 కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చని తెలియజేశారు.
సమావేశంలో డిప్యూటీ కమిషనర్ ఎస్.వెంకటరమణ, సెక్రటరీ శైలజవల్లి, మెప్మా జిల్లా ప్రాజెక్ట్ డైరక్టర్ కనకరాజు, ఎమ్మార్వో రంజిత్ కుమార్, డివిజనల్ పంచాయతీ ఆఫీసర్ నాగలత, డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ వీణా దేవి, ఎంఈఓ సుబ్రహ్మణ్యం, డిప్యూటీ తహసీల్దార్లు శ్రీనివాసరావు, నాగలక్ష్మి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు విరూపాక్ష, లోవరాజు, అసిస్టెంట్ సిటీ ప్లానర్ కొండలరావు, పాల్గొన్నారు.




