Nidadavole: ఉండ్రాజవరంలో వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన మాజీ వైస్ ఎంపీపీ!
Nidadavole: నిడదవోలు నియోజకవర్గం కాల్దరి గ్రామంలో వైసీపీకి చెందిన మాజీ వైస్ ఎంపీపీ చెట్టే నవీన్‌తో పాటు 160 మంది నాయకులు, కార్యకర్తలు బూరుగుపల్లి శేషారావు సమక్షంలో టీడీపీలో చేరారు.
Nidadavole: ఉండ్రాజవరంలో వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన మాజీ వైస్ ఎంపీపీ!
నిడదవోలు: నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం కాల్దరి గ్రామంలో వైసీపీకి చెందిన మాజీ వైస్ ఎంపీపీ శ్రీ చెట్టే నవీన్ గారితో పాటు సుమారు 160 మంది నాయకులు, కార్యకర్తలు శ్రీ బూరుగుపల్లి శేషారావు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, నిడదవోలు నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ శ్రీ బూరుగుపల్లి శేషారావు గారు, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా భాగస్వాములై పనిచేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నిడదవోలు AMC చైర్మన్ గాలింకి జిన్నబాబు గారు, ఉండ్రాజవరం మండల టీడీపీ అధ్యక్షులు సింహాద్రి రామకృష్ణ గారు, మాజీ ZPTC సభ్యులు కోమట్లపల్లి వెంకట సుబ్బారావు గారు, కాల్దరి గ్రామ మాజీ సర్పంచ్ చిపుళ్ళ అరుణ కుమారి గారు, మాజీ ఉప సర్పంచ్ ఈర్పిన సత్యనారాయణ గారు, కాల్దరి PACS చైర్మన్ కోమట్లపల్లి రామదాస్ గారు,గ్రామ టీడీపీ అధ్యక్షులు కోమట్లపల్లి విశ్వనాధం గారితో పాటు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




