kothapeta: కొత్తపేటలో వైసీపీకి షాక్: టీడీపీలోకి దంగేటి!

kothapeta: కోనసీమ జిల్లా కొత్తపేటలో వైసీపీకి షాక్. మాజీ వైస్ ఎంపీపీ దంగేటి వెంకట నాగమణి సుబ్రహ్మణ్యం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సమక్షంలో టీడీపీలో చేరారు.

TRIMURTULU, KOTHAPETA
Published on: 22 Oct 2026 5:50 PM IST
kothapeta
X

kothapeta: కొత్తపేటలో వైసీపీకి షాక్: టీడీపీలోకి దంగేటి!

kothapeta: డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట గ్రామం పనసలదొడ్డి ఏరియాకు చెందిన వైసీపీ మాజీ వైస్ ఎంపీపీ దంగేటి వెంకట నాగమణి సుబ్రహ్మణ్యం వైసీపీ ని వీడి తన అనుచరులతో కలిసి 35 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు.వెంకట నాగమణి సుబ్రహ్మణ్యం కు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

తన అనుచరులతో కలిసి సుబ్రహ్మణ్యం తెలుగుదేశం పార్టీలో చేరడంతో, స్థానిక ఎన్నికల వేల కొత్తపేట టీడీపీ లో కొత్త జోష్ వచ్చింది. ఎమ్మెల్యే సత్యానందరావు నాయకత్వంలో ఆయన ఆదేశాల మేరకు పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని సుబ్రహ్మణ్యం తెలిపారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల గెలుపు కోసం పూర్తి స్థాయిలో కృషి చేస్తానని దంగేటి సుబ్రహ్మణ్యం చెప్పారు.

TRIMURTULU, KOTHAPETA

TRIMURTULU, KOTHAPETA