Rajahmundry: సంఘ సేవకులను సత్కరించుకోవడం మన బాధ్యత: చల్లగాలి శ్రీనివాస్ వర్మ
Rajahmundry: రాజమండ్రి జ్ఞాన సరస్వతి ఘాట్ వద్ద ఈనెల 18న శోభిత్ వర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రముఖ కళాకారులు, సంఘ సేవకులకు ఘన సత్కారం జరగనుంది.
Rajahmundry: సంఘ సేవకులను సత్కరించుకోవడం మన బాధ్యత: చల్లగాలి శ్రీనివాస్ వర్మ
రాజమండ్రి: సమాజ శ్రేయస్సు, అభివృద్ధి కోసం పాటుపడే సంఘ సేవకులను, కళాకారులను సత్కరించుకోవడం, ప్రోత్సహించడం మనందరి బాధ్యతని శోభిత వర్మ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ చల్లగాలి శ్రీనివాస్ వర్మ అన్నారు.
రాష్ట్రంలోని ముగ్గురు ప్రఖ్యాత కళాకారులు, ముగ్గురు సంఘ సేవకులను ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించనున్నట్లు తెలిపారు. తన కుమారుడు దివంగత శోభిత వర్మ పేరిట చారిటబుల్ ట్రస్ట్ నెలకొల్పి గడచిన 17 నెలలుగా రాష్ట్రంలోని సుప్రసిద్ధులైన కళాకారులను, సంఘ సేవకులను సత్కరిస్తున్నట్లు చెప్పారు.
ఆ మేరకు ఈనెల 18 వ తేదీన రాజమహేంద్ర వరంలోని జ్ఞాన సరస్వతి ఘాట్ వద్ద ఈనెల 18వ తేదీన కాగితాల కృష్ణ, కాకుమాను శ్రీనివాసరావు, సాయి మాధవి, డ్రిల్ న్యూస్ క్రాంతి బీట్ బాక్స్ ఉపేంద్ర, మాకుర రజితలను ఘనంగా సత్కరించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కమాండింగ్ ఎస్పీ కొండా నరసింహారావు, శ్రీ శ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్ కత్తిమండ ప్రతాప్ కుమార్, రాష్ట్రపతి అవార్డు గ్రహీత డాక్టర్ సాంబేలు శాంతి భాయి మహిళా ప్రొటెక్షన్ సెల్ ఆల్ ఇండియా చైర్మన్ గోటికల శిరీష రాణి పాల్గొంటారన్నారు.
ఈ కార్యక్రమానికి కళాపోషకులు కళాకారులు కళాభిమానులు వచ్చి జయప్రదం చేయాలని ప్రముఖ ఇంద్రజాలికులు డాక్టర్ కళ్యాణి శ్రీనివాస్ వర్మలు తెలిపారు.




