Rajolu: రాజోలులో అగ్నిప్రమాదం.. మూడు కుటుంబాల ఇల్లు కళ్లముందే బూడిద!

Rajolu: కోనసీమ జిల్లా రాజోలు మండలం మెరకపాలెంలో అగ్నిప్రమాదం జరిగింది.

PRABHU, RAZOLE
Published on: 20 Jun 2026 11:23 AM IST
Rajolu
X

Rajolu: రాజోలులో అగ్నిప్రమాదం.. మూడు కుటుంబాల ఇల్లు కళ్లముందే బూడిద!

రాజోలు: డాక్టర్. బీఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం మెరకపాలెం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో మూడు కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా కూలర్ పేలిపోవడంతో ఉమ్మడి పెంకుటిల్లు పూర్తిగా అగ్నికి ఆహుతైంది.

గ్రామానికి చెందిన కోరుకొండ బాబురావు, కోరుకొండ కృష్ణమూర్తి తదితరులు కలిసి మూడు కుటుంబాలు ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఇంట్లో ఉన్న కూలర్‌లో విద్యుత్ లోపం ఏర్పడి పేలడంతో మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. దీంతో పెంకుటిల్లు పూర్తిగా మంటల్లో చిక్కుకుంది.

సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, స్థానికులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే అప్పటికే ఇంట్లోని గృహోపకరణాలు, ఫర్నిచర్, ఇతర సామగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి.

ఈ ప్రమాదంలో సుమారు రూ.5 లక్షల మేర ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని ఫైర్ సిబ్బంది ప్రాథమికంగా అంచనా వేశారు. ఘటన సమయంలో ఇంట్లో వృద్ధులు, చిన్నారులు సహా మొత్తం ఏడుగురు కుటుంబ సభ్యులు ఉన్నప్పటికీ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చింది.

అగ్నిప్రమాదంతో నిరాశ్రయులైన కుటుంబాలను ప్రభుత్వం, అధికారులు ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story