Magatapalli: సాయినాథ ఆశ్రమంలో గురుపూజోత్సవంలో పాల్గొన్న నామన రాంబాబు!

Magatapalli: మగటపల్లి జ్ఞాన సాయినాథ ఆశ్రమంలో గురుపూజోత్సవ వేడుకల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జెడ్పీ మాజీ చైర్మన్ నామన రాంబాబు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

PRABHU, RAZOLE
Published on: 29 July 2026 2:07 PM IST
Magatapalli
X

Magatapalli: సాయినాథ ఆశ్రమంలో గురుపూజోత్సవంలో పాల్గొన్న నామన రాంబాబు!

Magatapalli: డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మామిడికుదురు మండలం, మగటపల్లి (పాలెం) గ్రామంలో కొలువై ఉన్న శ్రీ సమర్థ సద్గురు శ్రీశ్రీశ్రీ జ్ఞాన సాయినాథ గురుపూజోత్సవ పర్వదినం సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ నామన రాంబాబు మంగళవారం ఆశ్రమాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా సాయినాథుని దర్శించుకుని ఆశీస్సులు పొందిన ఆయన, గురుపూజోత్సవాల ప్రాధాన్యాన్ని కొనియాడారు. అనంతరం నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో భక్తులతో కలిసి పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో బొలిశెట్టి ప్రభుదాస్, కుంపట్ల బాబ్జి, వద్దనీడి గంగాధర్, బొలిశెట్టి సత్యనారాయణ, సూరిశెట్టి వెంకటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story